Puneeth Rajkumar Death: మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు.. ఈ కొన్ని పదుల జీవితంలో సరదాలు సంతోషాలు అన్ని దిగమింగుకొని పంతాలు పట్టింపులకు పోతే నీ జీవితానికి సార్థకత ఉండదు.. ఇప్పుడు ఎంతో భవిష్యత్తు ఉన్న కన్నడ కంఠీరవుడి కుమారుడు అసవులు బాసాడు. మృత్యువు ఆయనను చిన్న వయసులోనే కబళించింది. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

-ఎలా చనిపోయారు.
కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ వయసు 46 సంవత్సరాలు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఉదయం 11.30 గంటలకు ఆయనకు గుండెపోటు సంభవించింది. జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూ కేర్ లో ఆయనకు డాక్టర్లు అత్యవసర చికిత్సను అందించారు. ఆస్పత్రికి తీసుకొని వచ్చేటప్పటికీ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. వెంటవెంటనే రెండుసార్లు గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమించినట్లు డాక్టర్లు పేర్కొంటున్నారు. ఆయన కుటుంబంలో అన్నయ్య ఇలానే జిమ్ చేస్తూ చనిపోగా.. తమ్ముడు తీవ్ర అస్వస్థతతో మంచానికే పరిమితమయ్యాడు. గుండెపోటు అనేది వంశపారంపర్యంగా కొనసాగుతోంది. అదో శాపంగా మారింది. పునీత్ రాజ్ కుమార్ కు జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరికి స్నేహం ఉంది. పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాటను కూడా పాడారు.
-కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడే పునీత్
కన్నడ కంఠీరవ లెజండరీ యాక్టర్ రాజ్ కుమార్ కుమారుడే రాజ్ కుమార్. రాజ్ కుమార్ మూడో కుమారుడు. మొదటి కుమారుడు శివరాజ్ కుమార్ కు కన్నడ చలనచిత్ర సీమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. రెండో కుమారుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ మొదట్లో హీరోగా అనేక సినిమాల్లో నటించారు. ఆయనకు కూడా గుండెపోటు రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఒక చెయ్యి పనిచేయదు.
-పునీత్ రాజ్ కుమార్ వ్యక్తిగత జీవితం
1975 మార్చి 17న కన్నడ కంఠీరవ రాజ్ కుమార్-పార్వతమ్మ దంపతులకు మూడో సంతానంగా పునీత్ జన్మించాడు. అందరూ అభిమానంగా అప్పూ అని ఈయనను పిలుస్తారు. పునీత్ కు ఆరేళ్ల వయసున్నప్పుడు కుటుంబం చెన్నై నుంచి మైసూరుకు తరలివచ్చింది. తండ్రి వారసత్వంగా చిన్ననాటి నుంచే సినిమాల్లో నటిస్తూ మెప్పించి కన్నడ పవర్ స్టార్ గా పునీత్ ఎదిగాడు. ఆయన చివరి సినిమా యువరత్న.
-పునీత్ కళ్లు దానం
గుండెపోటుతో కన్నుమూసిన పునీత్ రాజ్ కుమార్ తన మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడనున్నాడు. కన్నడ పవర్ స్టార్ కళ్లను దానం చేయనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. గతంలో పునీత్ ండ్రి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన నేత్రాలను మరొకరి కోసం కుటుంబీకులు దానం చేసి కొత్త వెలుగు ప్రసాదించాడు.
-కర్ణాటకలో సెలవు, సంతాపం.. ఆస్పత్రికి భారీగా అభిమానులు
కర్ణాటకలో రాజ్ కుమార్ మరణం సంభవించగానే ప్రభుత్వం దాచేసింది. స్వయంగా కర్ణాటక సీఎం బొమ్మై, హోంమంత్రి బయటకు విషయం పొక్కనీయలేదు. అనంతరం ఆస్పత్రికి చేరుకొని కుటుంబ సభ్యులతో అంత్ర్యక్రియల గురించి మాట్లాడాక పునీత్ మరణంపై అధికారికంగా ప్రకటించారు. కర్ణాటకలో థియేటర్లకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. సంతాప దినాలు ప్రకటించారు. కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు పెట్టారు. ఇక రాజ్ కుమార్ మరణంతో ఆస్పత్రికి అభిమానులు తరలివస్తున్నారు. వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టమవుతోంది.
Also Read: Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి…
-తెలుగు సినీ ప్రముఖుల సంతాపం
కన్నడ పవర్ స్టార్ పునీత్ మరణంపై ఆయన స్నేహితుడు జూ.ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, మహేష్ , మంచు లక్ష్మీ అగ్రహీరోలంతా సంతాపం తెలిపారు. ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పుకొచ్చారు.