https://oktelugu.com/

కేబినెట్ లోకి కవిత.. ఎవరికి ఎసరు?

గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా మౌనం దాల్చిన సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు జూలు విదిల్చారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తాజాగా భారీ విజయం సాధించి ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా చేశారు. మొత్తం 823 ఓట్లకు గాను ఏకంగా 728 ఓట్లను కైవసం చేసుకొని సత్తా చాటారు. ఓడిన గడ్డ మీదే సగర్వంగా నిలబడ్డారు. కవిత తొలిసారి శాసనమండలిలో అడుగుపెడుతున్నారు. కవిత గెలుపుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2020 / 07:15 PM IST
    Follow us on

    గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా మౌనం దాల్చిన సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు జూలు విదిల్చారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తాజాగా భారీ విజయం సాధించి ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా చేశారు. మొత్తం 823 ఓట్లకు గాను ఏకంగా 728 ఓట్లను కైవసం చేసుకొని సత్తా చాటారు. ఓడిన గడ్డ మీదే సగర్వంగా నిలబడ్డారు.

    కవిత తొలిసారి శాసనమండలిలో అడుగుపెడుతున్నారు. కవిత గెలుపుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయనే చర్చ మొదలైంది. కవితను రాజ్యసభకు పంపకుండా ఎమ్మెల్సీ బరిలో కేసీఆర్ దించడం వ్యూహాత్మకమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.

    కవితను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో సర్దుబాటు చేయాలంటే ఎవరినో ఒకరిని తప్పించాలి. ఇప్పటికే ఫుల్ టైట్ గా మంత్రివర్గం ఉంది. బీసీ, ఎస్సీ,ఎస్టీలకు ఎవరిని తప్పించినా విమర్శలు తథ్యం. అందుకే ఆగం మాగం చేసే మంత్రి మల్లారెడ్డిపై వేటు పడడం ఖాయమన్న చర్చ సాగుతోంది.

    కార్మిక ఉపాధి కల్పన  సంక్షేమ శాఖ మంత్రిగా మల్లారెడ్డి పనితీరు అస్సలు బాగా లేదని సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అప్పట్లో కేబినెట్ విస్తరణలోనే మంత్రి మల్లారెడ్డి పోస్టు ఊస్ట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఎందుకో కేసీఆర్ ఆగారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల పరీక్ష పెట్టారట.. అది పాస్ అయితే మల్లారెడ్డి ఉంటారు.. లేకపోతే మాజీ మంత్రి అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఎప్పుడూ లేనంతగా మల్లారెడ్డిలో కంగారు మొదలైందన్న టాక్ వినిపిస్తోంది.

    ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే కేటీఆర్ సీఎం అయితే కవితను తీసుకుంటారనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. అందుకే ఒక రెడ్డి, ఓసీ సామాజికవర్గ మంత్రికి చెక్ పెట్టి కవితను రిప్లేస్ చేస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కవిత కోసం త్యాగం చేసే ఆ త్యాగధనుడైన  మంత్రి ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.