Allu Arjun : పుష్ప 2 ఎవరూ ఊహించని విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీ వసూళ్లు అనేక చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేశాయి. బాహుబలి 2 రికార్డ్స్ చాలా ఏరియాల్లో పుష్ప 2 అధిగమించింది. ఆ మూవీ లైఫ్ టైం వసూళ్లపై కూడా పుష్ప 2 కన్నేసింది. కేవలం ఒక వంద కోట్ల రూపాయల దూరంగా పుష్ప 2 ఉంది. పుష్ప 2 వరల్డ్ వైడ్ రూ. 1720 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఒక్క హిందీలోనే పుష్ప 2 వసూళ్లు రూ. 740 కోట్లకు పైగా ఉన్నాయి. నార్త్ లో ఈ మూవీ వసూళ్లకు బ్రేక్ లేదు. ఇప్పటికీ స్ట్రాంగ్ గా కలెక్షన్స్ ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా విడుదలైన వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ మూవీ పుష్ప 2 ముందు తేలిపోయింది.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పుష్ప 2 సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పుష్ప 2కి సంబంధించిన మరొక ఆసక్తికర సమాచారం అందుతుంది. ఈ మెగా బ్లాక్ బస్టర్ కి అల్లు అర్జున్ మరోసారి డబ్బింగ్ చెబుతున్నాడట. విడుదలైన సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఏమిటని సందేహం రావచ్చు. ట్విస్ట్ అక్కడే ఉంది. పుష్ప 2 మూవీ నిడివి మూడు గంటలకు పైగా ఉంది. దాంతో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు కూడా ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చింది. అల్లు అర్జున్ జపాన్ వెళ్లడం, రావడంతో పాటు కొన్ని సన్నివేశాలకు కొనసాగింపు, సరైన జస్టిఫికేషన్ లేదు.
సదరు సన్నివేశాలు చిత్రీకరించినప్పటికీ.. సినిమా నిడివి మరింత పెరిగిపోతుందని ఎడిటింగ్ లో తొలగించారు. క్రిస్మస్ నుండి కొత్త సన్నివేశాలతో పుష్ప 2 ప్రదర్శిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే పుష్ప 2 ఓటీటీ వెర్షన్ లో ఎడిటింగ్ లో తొలగించిన సీన్స్ జోడించనున్నారట. ఈ సన్నివేశాలకు అల్లు అర్జున్ డబ్బించి చెప్పలేదట. అందుకే అన్నపూర్ణ స్టూడియోలో అల్లు అర్జున్ పుష్ప 2 సన్నివేశాలకు డబ్బింగ్ చెబుతున్నాడట. ఇది అభిమానులకు గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.
కాగా పుష్ప 3 సైతం ఆలోచనల్లో ఉంది. కానీ పార్ట్ 3 కార్యరూపం దాల్చడానికి సమయం ఉంది. నెక్స్ట్ అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నాడని సమాచారం.