Director Anudeep: జాతి రత్నాలు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు అనుదీప్ కె.వి…ఈయన డైరెక్షన్ లో వచ్చిన జాతి రత్నాలు సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందింది. అయితే ఈ సినిమా సక్సెస్ తో ఆయన ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక ముఖ్యంగా క్యాష్ షోలో ఆయన కనబరిచిన కామెడీని చూసినా అభిమానులు ఆయన్ని క్యాష్ అనుదీప్ అంటు తనకు కొత్త పేరును కూడా పెట్టేశారు.
ఇక ఇప్పుడు ఒక మీడియం రేంజ్ హీరోకి ఎంతైతే ఇమేజ్ ఉందో, అనుదీప్ కి కూడా అంతే ఇమేజ్ ఉందనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే అనుదీప్ చాలా రోజుల నుంచి కాళ్ళకి చెప్పులు వేసుకోకుండానే తిరుగుతున్నాడు. దానికి కారణం ఏంటి అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఎర్త్ కి తనకి మధ్య ఒక ఎఫెక్షన్ అనేది పెరగడానికి తను షూస్ లేకుండా తిరుగుతున్నాని చెప్పాడు…ఇక ఇలాంటి అనుదీప్ ఈమధ్య మళ్ళీ కాళ్లకు షూస్ వేసుకొని తిరుగుతున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఆయన కాళ్ళకి షూస్ ఎందుకు వేసుకుంటున్నారు అనే దానికి సంబంధించిన సీక్రెట్ ను కూడా ఆయన రీవిల్ చేశారు…
అది ఏంటి అంటే ఆయన పబ్లిక్ గా బయటికి వెళ్లినప్పుడు మొహానికి మాస్క్ వేసుకున్నా కూడా కింద కాళ్లకు చెప్పులు వేసుకోకపోవడం చూసిన చాలామంది ప్రేక్షకులు ఆయన అనుదీప్ అని గుర్తుపట్టి మరి ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ తనని కొంచెం ఇబ్బంది పెడుతున్నారంటా..ఇక దానివల్లే ఆయన కాళ్లకు చెప్పులు వేసుకోవడం స్టార్ట్ చేశారట… ఇక ఇది ఇలా ఉంటే మొత్తానికైతే అనుదీప్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ డైరెక్టర్ గా ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఈయన సెకండ్ సినిమాగా తమిళ్ ఇండస్ట్రీకి చెందిన శివ కార్తికేయన్ ను హీరోగా పెట్టి ప్రిన్స్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయిన కూడా రవితేజతో మరొక సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు…అనుదీప్ సినిమాలో కామెడీ అనేది ప్రధానంగా సాగుతుంది. కాబట్టి రవితేజతో కూడా కామెడీ ప్రాధాన్యం ఉన్న సినిమానే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…