PM Modi: నమస్కారానికి.. ప్రతి నమస్కారం.. సంస్కారం.. అలాంటి సంస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతల్లో చేసి చూపించారు. దేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ.. తాను సాధారణ మనిషినే అని నిరూపించారు. ఇటీవల భారత మండపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల భారత మండపంలో క్రియేటర్స్ సమ్మిట్ అనే పేరుతో వేడుక నిర్వహించారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ చూపుతున్న ఔత్సాహిక యువతీ యువకులను ప్రధానమంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా వారికి పురస్కారాలు అందజేశారు. అనంతరం వారితో ఇష్టా గోష్టిగా మాట్లాడారు. ఈ క్రమంలో ఓ కళాకారిణి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పురస్కారం అందుకొని.. ఆయన కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేసింది. అయితే దీనిని ప్రధానమంత్రి వారించారు. ప్రతిగా ఆమె కాళ్ళకు నమస్కారం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది
వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కాళ్ళను ఇంకొకరు మొక్కితే ఒప్పుకోరు. వద్దని వారిస్తారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అప్పట్లో పద్మశ్రీ గ్రహీతలకు పురస్కారాలు అందించే వేడుకలో.. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించారు. అది నచ్చని ప్రధాని వెంటనే తన కుర్చీలో నుంచి లేచి ఆ సామాజిక కార్యకర్తకు శిరస్సు వంచి ప్రణామం చేశారు. అప్పట్లో ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఇక తనకు వీలు చిక్కినప్పుడల్లా వారణాసి వెళ్లే ప్రధాన మంత్రి.. అక్కడి నగరపాలకంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడుగుతారు. వారితో సహపంక్తి భోజనాలు చేస్తారు.
ఇక ఇటీవల భారత మండపంలో జరిగిన క్రియేటర్స్ సమ్మిట్ లో ఓ ఔత్సాహిక కళాకారిణికి పురస్కారం అందించిన తర్వాత.. ప్రధాని ప్రతి నమస్కారం చేయడం ఆకట్టుకుంది. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “దేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ ఆ హోదాను ఎక్కడా చూపించలేదు. పైగా ఆమెన్కాళ్ళకు ప్రతి నమస్కారం చేశారు.. ఇదీ మోడీ హుందాతనమంటూ” వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది. దీనిని బిజెపి తెలంగాణ విభాగం ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.
View this post on Instagram