Tandel Rama Rao : నాగచైతన్య(Naga Chaithanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన తండేల్ (Thandel) సినిమా ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని భారీ లెవెల్లో చేపడుతున్నారు. ఇక ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన సినిమా యూనిట్ ఇప్పుడు మరింత వేగవంతం చేస్తూ ప్రమోషన్స్ ను చేయడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు అందరూ వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నాగచైతన్య కూడా స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తన మొదటి నుంచి కూడా మాస్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆయనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మాత్రం ఆయనకి ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. మరి ఈ సినిమాతో స్టార్ హీరోగా మారే అవకాశమైతే వచ్చింది. మరి ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆయన నెక్స్ట్ లెవెల్ హీరోగా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే తండేల్ సినిమా ఒరిజినల్ కథ ఆధారంగా తెరకెక్కుతుంది. నిజానికి తండేల్ రామారావు అనే ఒక చేపలు పట్టే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఆయన చేపలు పట్టడానికి వెళ్లి పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోయి అక్కడ 17 నెలల పాటు జైల్లో ఉన్నాడు.
ఇక మొత్తానికి తన టీమ్ తో పాటు మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం అనేది ఒక అచీవ్ మెంట్ గా మారింది. మరి ఈ గొప్ప సన్నివేశాలను కలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. నాగచైతన్య నిజ జీవితంలో తండేల్ రామారావు పోషించిన పాత్రను కొంచెం మార్చి తండేల్ రాజు గా చేయబోతున్నాడు.
కాబట్టి ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా మంచి హైప్ అయితే ఉంది. ఇక దేశభక్తి ప్రధానంగా సాగే ఈ సినిమాకి ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇదిలా ఉంటే తండేల్ రామారావు దగ్గర నుంచి ఈ కథను తీసుకున్నందుకుగాను అతనికి 20 లక్షల రూపాయలను రెమ్యూనరేషన్ గా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా తండేల్ రామారావు తన కథని స్క్రీన్ మీద తను చూసుకోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను అంటూ రీసెంట్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తండేల్ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఇటు గీత ఆర్ట్స్ బ్యానర్ కి అటు నాగచైతన్యకు మంచి బూస్టప్ ఇచ్చిన సినిమా అవుతుంది…