ఈమేరకు సోనూసుద్ నటిస్తున్న సినిమాల దర్శక, నిర్మాతలు అతడి క్యారెక్టర్ ను మార్చేస్తున్నారు. ఈ విషయాన్ని సోనూసుదే స్వయంగా వెల్లడించాడు. టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలుకాగా ఇటీవల సోనూసుద్ హైదరాబాద్ కు చేరుకున్నాడు. ‘అల్లుడు అదుర్స్’లో సోనూసుద్ విలన్ గా నటిస్తున్నాడు.
‘అల్లుడు అదుర్స్’ షూటింగు కోసం సోనూసుద్ ఇటీవల షూటింగుకురాగా చిత్రబృందం అతడిని కరతాళధ్వనుల మధ్య స్వాగతం తెలిపింది. అనంతరం అతడిని సన్మానించారు. ఇక ఈ సినిమాలో అతడిని విలన్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. అయితే లాక్డౌన్ తర్వాత సోనూసుద్ ఇమేజ్ మారిపోయింది. దీంతో అతడి పాత్రను దర్శకుడు మార్చివేశాడు. నెగిటివ్ పాత్రను కాస్తా పాజిటివ్ మార్చడంతోపాటు పాత్ర నిడివి పెంచాడు.
దీనిపై సోనూసుద్ మాట్లాడుతూ ఇప్పుడన్నీ తనకు పాజిటీవ్ పాత్రలే వస్తున్నాయని తెలిపాడు. ‘అల్లుడు అదుర్స్’లో తనది ముందు నెగిటివ్ పాత్ర అని అయితే ఇప్పుడు అది పాజిటివ్ గా మారిందనే విషయాన్ని సోనూసుద్ లీక్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న సోనూసుద్ ను కలుసుకునేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఇప్పటికే సోనూసుద్ ఆరు సినిమా కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండింటిలో హీరోగా నటించేందుకు సోనూసుద్ అంగీకరించాడనే టాక్ విన్పిస్తోంది. మొత్తంగా టాలీవుడ్ దర్శక, నిర్మాతలు రియల్ హీరోను కాస్తా రీల్ హీరోగా మార్చే పనిలోపడ్డారు. అయితే సోనూసుద్ వెండితెరపై హీరోగా రాణిస్తాడో లేదో వేచి చూడాల్సిందే..!