పారితోషికాల తగ్గింపుపై హీరోల మాటెంటీ?

కరోనా ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. థియేటర్లు మూతపడటం.. షూటింగులు నిలిచిపోవడంతో చిత్రసీమ కుదేలైపోతోంది. దీంతో సినిమాలను నిర్మించే నిర్మాతలను కాపాడుకునేందుకు టాలీవుడ్ చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే ఇటీవల ప్రొడ్యుసర్ గిల్డ్ ఓ కీలక సమావేశం నిర్వహించింది. హీరోహీరోయిన్లు.. నటీనటులు.. సాంకేతిక నిపుణులు కొంతమేరకు పారితోషికాలు తగ్గించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో నిర్మాతను కాపాడుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందని టాలీవుడ్ భావిస్తోంది. నిర్మాత బాగుంటేనే చిత్ర పరిశ్రమ బాగుంటుందనే అభిప్రాయాన్ని […]

Written By: NARESH, Updated On : October 5, 2020 10:38 am

Tollywood drug case

Follow us on


కరోనా ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. థియేటర్లు మూతపడటం.. షూటింగులు నిలిచిపోవడంతో చిత్రసీమ కుదేలైపోతోంది. దీంతో సినిమాలను నిర్మించే నిర్మాతలను కాపాడుకునేందుకు టాలీవుడ్ చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే ఇటీవల ప్రొడ్యుసర్ గిల్డ్ ఓ కీలక సమావేశం నిర్వహించింది. హీరోహీరోయిన్లు.. నటీనటులు.. సాంకేతిక నిపుణులు కొంతమేరకు పారితోషికాలు తగ్గించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

కరోనా విపత్కర పరిస్థితుల్లో నిర్మాతను కాపాడుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందని టాలీవుడ్ భావిస్తోంది. నిర్మాత బాగుంటేనే చిత్ర పరిశ్రమ బాగుంటుందనే అభిప్రాయాన్ని సినీ ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగులు చేయడం వల్ల నిర్మాతలపై మరింత భారం పడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతపై అధిక భారంపడకుండా నటీనటులంతా 20శాతం పారితోషికం తగ్గించుకోవాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి ‘మా’ సైతం ఆమోదం తెలిపిందనే టాక్ విన్పిస్తోంది.

20వేల లోపు పారితోషికం తీసుకునే వారికి ఇందులో మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. 20వేల నుంచి 5లక్షల పారితోషికం తీసుకునేవారికి డిస్కౌంట్ టారీఫ్ ఉండనుంది. ఇక 5లక్షలకు పైబడి పారితోషికం తీసుకునేవారు 20శాతం తగ్గించుకోవాలని ప్రొడ్యుసర్ గిల్డ్ కోరుతున్నారు. అయితే స్టార్ హీరోహీరోయిన్లు రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటుంది. వీరంతా పారితోషికంలో 20శాతం తగ్గించుకుంటారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఇప్పుడంతా హీరోలు చెప్పినట్లు నిర్మాతలు చేస్తున్నారు. స్టార్ హీరోలను మీ రెమ్యూనరేషన్లో 20శాతం తగ్గించుకోండని నిర్మాతలు డిమాండ్ చేసే పరిస్థితులు లేవు. ఒక్కో హీరో 50నుంచి 100కోట్ల రెమ్యూనరేష్ తీసుకుంటున్నారు. ఫలానా హీరో ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే లెక్కలు లేవు. ఫిక్స్ డ్.. ఎమ్మార్పీ రేట్లమీ లేకపోవడంతో పారితోషికం తగ్గింపు ఎలా వర్తిస్తుందనే సందేహలు కలుగుతున్నాయి.

దీంతో హీరోహీరోయిన్లు తమ రెమ్యూనేషన్ భారీగా పెంచి.. ఆ తర్వాత తగ్గించినట్లు కలరింగ్ ఇచ్చే అవకాశం కన్పిస్తోంది. దీంతో ఓ హీరో త‌న పారితోషికం త‌గ్గించుకున్నాడో.. లేదో చెప్పడం కష్టంగా మారనుంది. స్టార్ హీరోహీరోయిన్ల విషయంలో పారితోషికం తగ్గింపు ఏమోగానీ మిగతావారి విషయంలో సవ్యంగా జరిగేలా కన్పిస్తున్నాయి.