Homeఎంటర్టైన్మెంట్Rakesh and Sujatha : పెళ్లయి రెండు నెలలు కూడా కాలేదు: రాకింగ్‌ రాకేష్‌, జోర్దార్‌...

Rakesh and Sujatha : పెళ్లయి రెండు నెలలు కూడా కాలేదు: రాకింగ్‌ రాకేష్‌, జోర్దార్‌ సుజాత మధ్య గొడవలు: విడిపోయేందుకు సిద్ధం

Rakesh and Sujatha : ఆమె హెచ్‌ఎంటీవీలో జోర్దార్‌గా వార్తలు చదివేది. అతడు జబ్బర్దస్‌లో టీం లీడర్‌. ఇద్దరూ ఎక్కడ కలిశారో, ఎందుకు కలిశారో తెలియదు కానీ మొత్తానికి కలిశారు. మొదట్లో స్నేహం, తర్వాత ప్రేమ, చివరికి పెళ్లి చేసుకున్నారు. వారే జోర్దార్‌ సుజాత, రాకింగ్‌ రాకేష్‌. తిరుపతి వెంకన్న సన్నిధిలో ఒక్కటయ్యారు. తర్వాత ఇద్దరూ జబ్బర్దస్త్‌లో తమ కెరియర్‌ కంటిన్యూ చేస్తున్నారు. మొన్ననే వారి అధికారిక యూట్యూబ్‌ చానెల్‌లో తమ పెళ్లికి సంబంధించిన పెళ్లి వీడియోను అప్‌లోడ్‌ చేశారు. నెటిజన్ల నుంచి దానికి మంచి స్పందన వస్తోంది. రాకేష్‌, సుజాత రీల్‌ లైఫే కాదు రియల్‌ లైఫ్‌లో ఈవెంటన్లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటుంటారు. అన్యోన్యంగా సాగుతున్న వారి సంసారంలో కలతలు మొదలయ్యాయి. ఒకరంటే ఒకరు పడని స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభయ్యాయి.

అయితే ఇదేదో వారి రియల్‌ లైఫ్‌లో కాదు. రీల్‌ లైఫ్‌లో.. రాకింగ్‌ రాకేష్‌ ప్రవీణ్‌, సుజాత తో స్కిట్లు చేస్తుంటాడు. పెళ్లి కాకముందే అతడి టీంలోకి సుజాత వచ్చి చేరింది. రాకేష్‌, సుజాత మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. అప్పట్లో సుధీర్‌, రష్మీ మఽఽధ్య ఎంతటి హెల్తీ కెమిస్ట్రీ ఉండేదో.. ప్రస్తుతం వీరిద్దరి మధ్య అంత అన్యోన్యత ఉంది. స్కిట్లు కూడా చాలా సెటిల్డ్‌గా ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రవీణ్‌ వేసే పంచ్‌ డైలాగులు పేలుతాయి. కొన్ని కొన్ని స్కిట్లలో ప్రవీణ్‌ డామినేషన్‌ బాగుంటుంది. తెలంగాణ యాసలో అతడు మాట్లాడే మాటలు వినసొంపుగా ఉంటాయి.

తాజాగా రాకేష్‌, సుజాత కాంబినేషన్‌లో వచ్చిన స్కిట్‌ హిలేరియస్‌గా ఉంది. త్వరలో ప్రాసారం కాబోయే ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో విడుదలయింది. ఇందులో రాకేష్‌, సుజాత గొడవ పడతారు. వారు గొడవ పడటమే తనకు కావాలని ప్రవీణ్‌ అంటాడు. ఇలా సాగుతుండగానే ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటారు. దీంతో సుజాతతో పడలేనని రాకేష్‌ వెళ్లిపోతాడు. అలా వెళ్లిపోతుండగా వర్షను ఆలింగనం చేసుకుంటాడు. తన భర్తను వర్ష కౌగింలించుకోవడం చూసి తట్టుకోలేక సుజాత ఆమెను దూషిస్తుంది. కొట్టేందుకు కూడా వెనుకాడదు. ఆక్రమంలోనే వెనుక నుంచి వస్తున్న ప్రవీణ్‌ వర్షను ఆలింగనం చేసుకుంటాడు. ఈ కామెడీ చూసి జడ్జీలు పగలబడి నవ్వుతారు. ఇంకా ఇందులో బుల్లెట్‌ భాస్కర్‌, తాగుబోతు రమేష్‌, ఆటో రాంప్రసాద్‌ స్కిట్లు కూడా హిలేరియస్‌గా ఉన్నాయి. అన్నట్టు ఈ ఎపిసోడ్‌ వచ్చే శుక్రవారం ఈటీవీలో ప్రసారం కాబోతోంది.

Extra Jabardasth Latest Promo - 21st April 2023 - Rashmi Gautam,Kushboo,Bullet Bhaskar,Immaneul

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version