Re-release movies : ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కింగ్స్ గా నిలిచారు. మిగిలిన ఏ హీరో కూడా వీళ్ళ దరిదాపుల్లోకి కూడా కనీసం రాలేకపోతున్నారు. ఇండస్ట్రీ లో ఎంతమంది పాన్ ఇండియన్ హీరోలు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయం లో అందరి హీరోలకంటే ఒక మెట్టు ఎక్కువే ఉన్నారు అని వీళ్ళ రీ రిలీజ్ సినిమాలకు వస్తున్న వసూళ్లను చూసి చెప్పొచ్చు. అయితే వీళ్ళ సినిమాల రికార్డ్స్ ని కొట్టాలంటే కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు ఉన్నాయి. అవి థియేటర్స్ లో అనుభూతి చెందితేనే కలిగే అద్భుతమైన అనుభూతి, ఈ సినిమాలు రీ రిలీజ్ అయితే కచ్చితంగా ఈ అగ్ర హీరోలిద్దరి రీ రిలీజ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇంతకీ అంతటి సత్తా ఉన్న సినిమాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.
1) అరుంధతి :
అనుష్క – కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను తెగ భయపెట్టేసింది. అనుష్క కోటలోకి అడుగుపెట్టినప్పుడు ఆడియన్స్ థియేటర్స్ లో వణికిపోయారు. ఈ సినిమాని విడుదల చేస్తే రీ రిలీజ్ చిత్రాలలో సంచలనం సృష్టించిన చిత్రంగా నిలుస్తుంది. అప్పట్లోనే 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిల్చిన ఈ చిత్రం, ఇప్పుడు విడుదలైతే రీ రిలీజ్ చిత్రాలలో టాప్ 1 గా నిలిచే అవకాశం ఉంది.
2) చంద్రముఖి:
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ఈ చిత్రం అప్పట్లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి సౌత్ ఇండియాలోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ముఖ్యంగా ఈ సినిమాని థియేటర్స్ లో చూసిన కొంతమంది ఆడియన్స్ కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దెయ్యంగా జ్యోతిక నటన ఇందులో అంత భయంకరంగా ఉంటుంది మరి. ఈ సినిమాని కూడా రీ రిలీజ్ చేస్తే ఆల్ టైం రికార్డు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
3) మయూరి :
నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ కి వణుకు పుట్టించింది, బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా కూడా కచ్చితంగా రీ రిలీజ్ అవ్వాల్సిన క్యాటగిరీలో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి మేకర్స్ విడుదల చేస్తారా లేదా అన్నది చూడాలి.
4) బాహుబలి సిరీస్ :
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23 వ తారీఖున అభిమానులు ‘డార్లింగ్’, ‘ఈశ్వర్’ సినిమాలు వేసుకుంటున్నారు. కానీ ఇవి కాదు, బాహుబలి సిరీస్ ని ప్లాన్ చేస్తే రీ రిలీజ్ రికార్డ్స్ ని భారీ మార్జిన్ తో బ్రేక్ చేసేవాళ్ళు. తెలుగు సినిమాకి పాన్ ఇండియన్ మార్కెట్ తెచ్చిపెట్టిన ఈ చిత్రం ఇచ్చిన థియేట్రికల్ అనుభూతి న భూతో..న భవిష్యతి రేంజ్ లో ఉంటుంది. రీ రిలీజ్ చేస్తే మరొక్కసారి ఆడియన్స్ ఆ థియేట్రికల్ అనుభూతిని ఆస్వాదిస్తారు.