Duleep trophy 2024 : గాల్లోకి డైవ్ చేస్తూ.. ఒంటి చేత్తో క్యాచ్ అందుకుని.. దులీప్ ట్రోఫీలో తెలుగు కుర్రాడి అద్భుతం

దులీప్ ట్రోఫీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా - ఏ, ఇండియా - బీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ క్షణక్షణం మలుపులు తిరుగుతోంది. రెండు జట్ల చెందిన ఆటగాళ్లు హోరా హరీగా ఆడుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 8, 2024 7:46 pm

Nithish Kumar Reddy Catch

Follow us on

Duleep trophy 2024 :  ఇండియా – బీ జట్టు ఓవర్ నైట్ స్కోర్ 150/6 తో చివరి రోజు ఆటను ప్రారంభించింది. మరో 34 పరుగులు జోడించి మిగతా వికెట్లు కోల్పోయింది. వాస్తవానికి ఇండియా – బీ జట్టు స్కోరు 200 కు చేరుకుంటుందని అందరూ భావించారు. కానీ ఆ జట్టుకు చెందిన చివరి నలుగురు ఆటగాళ్లు కేవలం 34 పరుగుల వ్యవధిలోనే అవుట్ అయ్యారు.. ఇండియా – బీ జట్టులో రిషబ్ పంత్ 51, సర్ఫరాజ్ ఖాన్ 46 పరుగులు చేసి టాప్ స్కోరర్లు గా నిలిచారు. ఇండియా – ఏ జట్టులో ఆకాశ్ దీప్ ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లతో సత్తా చాటాడు..

ఇండియా – బీ జట్టు విధించిన 275 పరుగుల విజయ లక్ష్యంతో ఇండియా – ఏ జట్టు 51 రన్స్ కే రెండు వికెట్లు నష్టపోయింది. మయాంక్ అగర్వాల్ 3, రియాన్ పరాగ్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మయాంక్ అగర్వాల్ తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో అతడు ప్రారంభంలోనే పెవిలియన్ చేరుకున్నాడు. యష్ దయాల్ వేసిన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. మయాంక్ సెకండ్ స్లిప్ లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డికి దొరికిపోయాడు. సెకండ్, థర్డ్ స్లిప్ మధ్య దూసుకుపోతున్న బంతిని నితీష్ రెడ్డి కుడివైపున గాల్లోకి ఎగురుతూ ఒక్క చేత్తో పట్టుకున్నాడు. ఇక ఇదే క్రమంలో నితీష్ రెడ్డి మైదానానికి బలంగా తాకాడు. దీంతో బంతి అతని చేతి నుంచి జారిపోయింది. లిప్త పాటు కాలంలో నితీష్ రెడ్డి స్పందించి ఎడమ చేతితో తన బరువును బ్యాలెన్స్ చేసుకుంటూ క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్యాచ్ అందుకున్న కాసేపటికి నితీష్ రెడ్డి..గిల్ బ్యాట్ ను తగులుతూ లేచిన బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. నవదీప్ షైనీ బౌలింగ్ లో గిల్ కొట్టిన బంతి స్లిప్లో లేచింది. అయితే దానిని అందుకోవడంలో నితీష్ రెడ్డి విఫలమయ్యాడు.

ఇక తొలి ఇన్నింగ్స్ లో ఇండియా – బీ జట్టు 321 రన్స్ చేసింది. ముషీర్ ఖాన్ 181 రన్స్ చేశాడు. నవదీప్ షైనీ 56 పరుగులు చేశాడు. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇండియా ఏ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 231 రన్స్ చేసింది. 37 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముఖేష్ కుమార్, నవదీప్ శైని మూడు వికెట్లు దక్కించుకున్నారు. సాయి కిషోర్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు.