https://oktelugu.com/

RC15: శంకర్​- చరణ్​ సినిమా రిలీజ్​ డేట్​పై ఇంట్రస్టింగ్ అప్​డేట్​.. రివీల్​ చేసిన చెర్రి

RC15: మెగాస్టార్ రామ్​చరణ్ హీరోగా పాన్​ ఇండియా లెవెల్​ శంకర్​ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనికి ఆర్సీ15 వర్క్ టైటిల్​తో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మొదటి షెడ్యూల్​ను మహారాష్ట్రలోని పూణె, సతారా, ఫాల్డన్​లలో షూటింగ్​ పూర్తి చేసుకున్న టీమ్.. ఇప్పుడు హైదరాబాద్​లో వేసిన సెట్​లో సెకెండ్​ షెడ్యూల్​ను మొదలుపెట్టింది. ఇందులో ఓ సాంగ్​తో పాటు పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా, ఓ ఆంగ్ల మీడియా పోర్టల్​తో మాట్లాడిన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 1, 2021 / 02:03 PM IST
    Follow us on

    RC15: మెగాస్టార్ రామ్​చరణ్ హీరోగా పాన్​ ఇండియా లెవెల్​ శంకర్​ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనికి ఆర్సీ15 వర్క్ టైటిల్​తో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మొదటి షెడ్యూల్​ను మహారాష్ట్రలోని పూణె, సతారా, ఫాల్డన్​లలో షూటింగ్​ పూర్తి చేసుకున్న టీమ్.. ఇప్పుడు హైదరాబాద్​లో వేసిన సెట్​లో సెకెండ్​ షెడ్యూల్​ను మొదలుపెట్టింది. ఇందులో ఓ సాంగ్​తో పాటు పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా, ఓ ఆంగ్ల మీడియా పోర్టల్​తో మాట్లాడిన రామ్​చరణ్​.. ఈ సినిమా విడుదల తేదీ ప్లాన్​ను రివీల్​ చేశారు.

    మెహా హీరో శంకర్​తో కలిసి చేసే ప్రతిక్షణాన్ని ఆస్వాధిస్తున్నానని అన్నారు. శంకర్​ వంటి స్టార్ డైరెక్టర్​తో పని చేస్తున్నప్పుడు మధురమైన క్షణాలను ఆనందించినట్లు తెలిపారు. ఆర్సీ 15  సినిమా పొలిటిలక్ డ్రామా అని.. శంకర్​ స్క్రిప్ట్​, విజన్, ప్రాజెక్టుల్లో భాగం కావడం.. నటుడిగా నాకు ఆనందకరమైన అనుభవమని అన్నారు.  ఈ క్రమంలోనే సినిమా విడుదల గురించి చెప్పేశారు చెర్రి. 2023 ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు.

    మరోవైపు ఆర్​ఆర్​ఆర్​ గురించి స్పందిస్తూ.. నటుడిగా కొత్త మార్గాన్ని అన్వేశించడానికి ఈ సినిమా తనకు ఎంతో సాయపడిందని అన్నారు. ఆర్​ఆర్​ఆర్​లో తను విభిన్న పాత్రల్లో నటించినట్లు తెలిపారు. అనేక రూపాల్లో కనిపించనున్నట్లు వివరించారు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. వీరితో పాటు ఆలియా భట్​, అజయ్​ దేవగణ్​, శ్రెయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.