Homeఎంటర్టైన్మెంట్Akhanda: అఖండ సినిమాపై బోయపాటి ఎక్కువగా స్పందించకపోడానికి కారణం ఇదేనట?

Akhanda: అఖండ సినిమాపై బోయపాటి ఎక్కువగా స్పందించకపోడానికి కారణం ఇదేనట?

Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్నసినిమా అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్​పై మిర్యాల రవీందంర్​ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా డిసెంబరు 2న విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు ఈ  సినిమా సర్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్​ జోరుగా సాగుతున్నాయి. ఎప్పుడూ బోయపాటి తన సినిమా రిలీజ్​కు మంచి హైప్​ ఇస్తుంటారు. కానీ, ఈ సినిమా గురించి ఇప్పటి వరకు జోయపాటి తనదైన స్టైల్​లో మాట్లాడకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Akhanda
Akhanda

Also Read: “రాధేశ్యామ్” నుంచి హిందీ లో రెండో పాట రిలీజ్… కెమిస్ట్రీతో అదరగొట్టిన ప్రభాస్, పూజా

పైగా, నేనేదైనా ఈ సినిమా రిలీజ్ తర్వాతే మాట్లాడతానని.. ఇప్పుడేమీ స్పందించాలనుకోవట్లేదని చెప్తున్నారు. దీంతో, అందరూ బోయపాటి మాటలకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వినయ విధేయ రామ సినిమా విషయంలో తాను చెప్పింది ఒకటైతే.. జరిగింది ఇంకొకటి కావడంతో విపరీతమైన ట్రోలింగ్​ను ఎదుర్కొన్నాడు. అందుకే, ఈ సారి బోయపాటి తన పరిధి తాటి మాట్లాడటం లేదని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్​, పాటలు విడుదలై నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నారు. దీంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.  ఈ సినిమాలో శ్రీకాంత్​ విలన్ గా కనిపించనున్నారు. జగపతి బాబు విభిన్న పాత్ర పోషిస్తున్నారు. కాగా, ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా నటించనుంది.

ఇక ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఆలాగే ఆ తర్వాత యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. అదేవిధంగా కొరటాల శివతో కూడా సినిమా ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Also Read: Akhanda Movie Dialogues, Balayya Babu Akhanda Dialogues

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version