Unstoppable Show: నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఒక వైపు ఆయన నటించిన అఖండ సినిమా రేపు (డిసెంబర్ 2) న విడుదల కాబోతుంది. ఆ తర్వాత గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి తో సినిమాలను లైన్ లో పెట్టారు బాలయ్య. అలానే ప్రస్తుతం ఓటీటీలో కూడా సందడి చేస్తున్నారు బాలయ్య. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ “ఆహా” తో కలిసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తున్నారు.

కాగా, ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని ట్రెండింగ్‌లో దూసుకెళ్లిపోతున్నారు. బాలయ్య టాక్ షోకు మొదటి ఎపిసోడ్ గెస్ట్‌గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు హాజరై సందడి చేశారు. సీనియర్ నటులైన బాలకృష్ణ, మోహన్ బాబు మధ్య నడిచిన మాటల ప్రవాహం జనాన్ని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత రెండో ఎపిసోడ్‌లో నాచురల్ స్టార్ నానితో బాలయ్య హంగామా నడిచింది. ఇక తర్వాత ఎపిసోడ్‌లో ఎవరు గెస్ట్‌గా వస్తారని అనుకుంటుండగా… ఇటీవల బాలయ్య బుజానికి సర్జరీ కావడంతో కాస్త బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
Comedy KING #Brahmanandam and FUNtastic Director @AnilRavipudi are on our sets this week to tickle your bones! 😄😄#UnstoppableWithNBK episode 3 premieres Dec 3.
#NandamuriBalakrishna #MansionHouse @tnldoublehorse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustriesltd pic.twitter.com/ndKSmKgg2l— ahavideoin (@ahavideoIN) December 1, 2021
అఖండ షూటింగ్‌లో జరిగిన ప్రమాదం వల్ల చేతికి గాయం కావడంతో బాలయ్య కొంత కాలం పాటు షోకి బ్రేక్ ఇచ్చారు. ఆయన కాస్త కోలుకోవడంతో గత శుక్రవారం తిరిగి షూటింగ్ షురూ చేశారు. మరింత ఉత్సాహంతో, రెట్టింపు ఎనర్జీతో బాలయ్య బాబు ఈజ్ బ్యాక్… అంటూ ఆహా టీం అధికారిక ప్రకటన ఇచ్చేసింది. ఇప్పుడు ఆ స్పీడుకు నవ్వుల రారాజు బ్రహ్మానందాన్ని యాడ్ చేయబోతున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు రాగా, దీనిపై అధికారిక ప్రకటన చేశారు ఆహా టీమ్. బ్రహ్మీతో పాటు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ లుగా రాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. బ్రహ్మీ, అనిల్ రావిపూడి ప్రేక్షకులని ఎంతగా ఎంటర్‌టైన్ చేస్తారో చూడాలి.