https://oktelugu.com/

ర‌వితేజ ‘RT67’ ప్రీ లుక్ పోస్టర్ !

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, ‘రాక్ష‌సుడు’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మించేందుకు ప్ర‌ముఖ నిర్మాత స‌త్య‌నారాయ‌ణ కోనేరు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. Also Read: ‘రాధేశ్యామ్’ టీమ్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..! ‘ఆర్‌టి67’ (ర‌వితేజ 67వ చిత్రం) ప్రి లుక్ పోస్ట‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేశారు. ఇందులో స్టైలిష్ డాన్స్ చేస్తున్న‌ట్లున్న ర‌వితేజ షాడో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 17, 2020 / 05:37 PM IST
    Follow us on

    మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, ‘రాక్ష‌సుడు’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మించేందుకు ప్ర‌ముఖ నిర్మాత స‌త్య‌నారాయ‌ణ కోనేరు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

    Also Read: ‘రాధేశ్యామ్’ టీమ్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

    ‘ఆర్‌టి67’ (ర‌వితేజ 67వ చిత్రం) ప్రి లుక్ పోస్ట‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేశారు. ఇందులో స్టైలిష్ డాన్స్ చేస్తున్న‌ట్లున్న ర‌వితేజ షాడో ఇమేజ్‌ను మ‌నం చూడొచ్చు. ఈ హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ మూవీ ముహూర్తం వేడుక ఆదివారం జ‌ర‌గ‌నున్న‌ది. అదేరోజు ఉద‌యం 11:55 గంట‌ల‌కు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

    Also Read: స్కామ్-1992: ఇండియాలో టాప్ వెబ్ సిరీస్.. ప్రత్యేకతేంటీ?

    ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి నాయిక‌గా న‌టించే ఈ చిత్రంలో డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్‌గా ఎంపిక‌య్యారు.