https://oktelugu.com/

బ్రేకింగ్: కంగనా రనౌత్ పై దేశద్రోహం కేసు

మహారాష్ట్ర సర్కార్ తో ఢీ అంటే అని వార్తల్లో నిలిచింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. మహారాష్ట్రలోని శివసేన సర్కార్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో శివసేన సర్కార్ హస్తం ఉందని.. ఆ కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించి సంచలనం సృష్టించింది. Also Read: దిగ్గజ అగ్ర హీరో కొడుకుపై రేప్ కేసు అయితే తాజాగా కంగనా రనౌత్ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై దేశద్రోహం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 17, 2020 / 05:40 PM IST
    Follow us on

    మహారాష్ట్ర సర్కార్ తో ఢీ అంటే అని వార్తల్లో నిలిచింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. మహారాష్ట్రలోని శివసేన సర్కార్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో శివసేన సర్కార్ హస్తం ఉందని.. ఆ కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించి సంచలనం సృష్టించింది.

    Also Read: దిగ్గజ అగ్ర హీరో కొడుకుపై రేప్ కేసు

    అయితే తాజాగా కంగనా రనౌత్ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు కావడం సంచలనమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్వీట్లు చేసే కంగనా ఆ మధ్య చేసిన ట్వీట్ దుమారం రేపింది.

    అప్పట్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఎటూ తేల్చని మహారాష్ట్ర సర్కార్ ను, ముంబై పోలీసులపై కంగనా ట్వీట్లలో పరుష వ్యాఖ్యలు చేసింది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా పోల్చడం వివాదాస్పదమైంది. ముంబై పోలీసులను బాబర్స్ అంటూ కంగనా నోరుపారేసుకుంది.

    ఈ క్రమంలోనే కంగనా రెచ్చగొట్టేలా విద్వేష పూరిత వ్యాఖ్లయు చేశారని తాజాగా కాస్టింగ్ డైరెక్టర్ , ఫిట్నెస్ ట్రైనర్ మున్నావరలీ సయ్యద్ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టుకు ఫిర్యాదు చేశఆరు.

    Also Read: స్కామ్-1992: ఇండియాలో టాప్ వెబ్ సిరీస్.. ప్రత్యేకతేంటీ?

    ఈ నేపథ్యంలోనే కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా కోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశంతో ముంబై పోలీసులు కంగనపై దేశద్రోహం కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం సంచలనమైంది. ఈ కేసుతో కంగన చిక్కుల్లో పడ్డట్టు అయ్యింది.