Raviteja Rajamouli combo movies: దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఆసక్తి చూపిస్తున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే మాస్ దర్శకుడిగా అవతరించిన ఆయన ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరిని స్టార్ హీరోలుగా మార్చేశాడు. రవితేజ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమాతో రవితేజ టాప్ లెవల్ కి వెళ్ళిపోయాడు. ఈ మూవీ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావాల్సింది. కానీ అది అనుకోని కారణాలవల్ల కార్య రూపం దాల్చలేదు. ఇక ఏది ఏమైనా కూడా రవితేజ లాంటి నటుడు ఇండస్ట్రీకి భారీ సక్సెస్ లను అందించాడు. అలాగే రాజమౌళి లాంటి దర్శకుడు ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తూ వచ్చాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వచ్చుంటే అది నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని చాలామంది అభిమానులు కోరుకున్నారు.
కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ‘విక్రమార్కుడు 2’ సినిమా చేద్దామని రాజమౌళి అనుకున్నారట. కానీ అప్పుడే సీన్ లోకి చిరంజీవి ఎంటరయ్యాడు. రామ్ చరణ్ తో ఒక సినిమా చేయమని చెప్పారట. దాంతో మగధీర సినిమాకు సంబంధించిన పనులు చకచక జరిగిపోయాయి.
అందువల్లే ‘విక్రమార్కుడు 2’ సినిమా చేయలేదు… రాజమౌళి – రవితేజ కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చిఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళని టాప్ లెవెల్ కి తీసుకెళ్ళాయి.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది. ఇక రవితేజ సైతం శివ నిర్వాణ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…