Adivi Sesh latest news: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ఉన్నారు. అయితే ఈ హీరోలతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్లతో సినిమాలు చేసే అవకాశం కొంతమందికి మాత్రమే వస్తుంది… కారణం ఏంటి అంటే స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే వాళ్ళు స్టార్ డైరెక్టర్ అయి ఉండాలి. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాతనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి అవకాశమైతే దక్కుతుంది. ఇక రీసెంట్ గా నటుడు అడవి శేషు సైతం ఇదే విషయాన్ని క్లారిటీగా చెప్పాడు. ఏప్రిల్ 10 వ తేదీన డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెద్ద దర్శకులతో ఎందుకు సినిమాలను చేయలేకపోతున్నారని అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇలా చెప్పాడు.
ఇండస్ట్రీలో ఉన్న ఆరుగురు స్టార్ హీరోలను కవర్ చేస్తూ ఏడుగురు పెద్ద దర్శకులు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఆ స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తారు. ఆ స్టార్ హీరోలు సైతం ఆ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే నాకు పెద్ద దర్శకుడితో సినిమా చేసే అవకాశం దొరకడం లేదు.
అందువల్లే నేను నాకు దొరికిన వాళ్ళతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాను అంటూ ఆయన చాలా క్లారిటీగా సమాధానం చెప్పాడు. అయితే ఇండస్ట్రీలో ఉన్న టైర్ వన్ హీరోల్లో ఆరుగురు ఎవరు అనేది మనకు తెలుసు… కానీ ఆ ఏడుగురు దర్శకులు ఎవరు అనే విషయంలోనే ఇంకా సరైన క్లారిటీ రావడం లేదంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరి కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో ఆ ఏడుగురు దర్శకుల పేర్లు కూడా క్లారిటీగా చెప్పేస్తున్నారు. వాళ్లెవరంటే రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి లాంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి… ఇక ఈ దర్శకులు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపించడం లేదు…