Homeఎంటర్టైన్మెంట్Ravichandran Ashwin comments: 'ఉస్తాద్ భగత్ సింగ్' పై క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్ హాట్...

Ravichandran Ashwin comments: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్ హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Ravichandran Ashwin comments: రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ‘ఓజీ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ గొప్పగా రాలేదు లాంగ్ రన్ అయితే అత్యంత దారుణం. మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ కి, క్లోజింగ్ లో వంద కోట్ల గ్రాస్ కొట్టడం కూడా కష్టం అయ్యింది అంటే, ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. థియేటర్స్ లో చూడకుండా, ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూసిన వాళ్ళు కూడా నెగెటివ్ గానే కామెంట్స్ చేశారు.

అయితే ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ కి నచ్చలేదు కానీ , హిందీ ఆడియన్స్ కి మాత్రం తెగ నచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లోకి ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చి 3 వారాలు అయ్యింది, ఈ మూడు వారాల్లో ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 70 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఒక ఫ్లాప్ సినిమాకు ఈ రేంజ్ వ్యూస్ రావడం గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి జరిగింది. మళ్లీ ఇన్ని రోజులకు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయం లో జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి కోటి కి పైగా వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే , రీసెంట్ గానే ఈ చిత్రాన్ని ప్రముఖ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వీక్షించాడు. ఒక లైవ్ చాట్ లో ఇంటర్వ్యూయర్ తో మాట్లాడుతున్న ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ లైవ్ చాట్ లో ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చూశాను , చాలా నచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. రవి చంద్రన్ చేసిన ఈ కామెంట్స్, ఈ చిత్రానికి పెద్ద ప్రమోషన్ లాగా మారిపోయింది. మూడవ వారం లో 9 వ స్థానం లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా , ఒక్కసారిగా రవి చంద్రన్ అశ్విన్ కారణంగా 6 వ స్థానానికి ఎగబాకింది , ఈ వీకెండ్ కి కచ్చితంగా టాప్ 3 కి ఎగబాకిన ఆశ్చర్యపోనక్కర్లేదు, ఆ రేంజ్ లో నెట్ ఫ్లిక్స్ లో సునామీ సృష్టిస్తోంది ఈ చిత్రం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...

Yashasvi Jaiswal: ఒక్క డిన్నర్.. ఈ క్రికెటర్ జీవితాన్ని ఎలా మార్చిందంటే..

Yashasvi Jaiswal: ఇప్పుడు మనం సోషల్ మీడియా కాలంలో ఉన్నాం. ఏదైనా జరిగితే చాలు.. దానికి తగ్గట్టుగా కథలు అల్లడం.. దానిని వ్యాప్తిలోకి తీసుకురావడం అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా కాలంలో నిజాలకు విలువలేదు....

Jailer 2: రజినీకాంత్ ‘జైలర్ 2’ విషయంలో ఆ తప్పు జరగబోతుందిగా…

Jailer 2: రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'జైలర్ 2' సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జైలర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో జైలర్...

Hardik Pandya: హార్దిక్ చెప్పినట్టు.. సీఎస్కే మేనేజ్మెంట్ ఆడుతోంది.. ఏం జరుగుతుందో..

Hardik Pandya: గొప్ప ఆటగాడే. గతంలో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత మనోడి ఆట మారిపోయింది. బౌలింగ్ తన స్థాయిలో...

RHA Movement: దేశవ్యాప్తంగా మరో ఉద్యమం.. ఈసారి అదే లక్ష్యం!

RHA Movement: సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించిన సీజీపీ నీటి...
Oktelugu Epaper
Exit mobile version