Homeఎంటర్టైన్మెంట్OG movie premiere shows gross: చెక్కు చెదరని 'ఓజీ' ప్రీమియర్ షోస్ గ్రాస్.. భవిష్యత్తులో...

OG movie premiere shows gross: చెక్కు చెదరని ‘ఓజీ’ ప్రీమియర్ షోస్ గ్రాస్.. భవిష్యత్తులో దీని బద్దలు కొట్టేది ఎవరు..?

OG movie premiere shows gross: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సరైన సినిమా పడితే , రికార్డ్స్ మామూలు రేంజ్ లో ఉండవు అని మొదటి నుండి అందరూ అంటుంటారు. ఆయనకు ఎన్ని ఫ్లాపులు పడినా, మరుసటి సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ ని రప్పిస్తుంటాడు. గడిచిన రెండున్నర దశాబ్దాల నుండి మనం ఇదంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు , ఆ రంగం లోకి వెళ్లిన తర్వాత కచ్చితంగా ఒక సెక్షన్ ఆడియన్స్ కి దూరం అవుతాడు, ఇక ఆయన సినిమాలకు మునుపటి వైభవం ఉండదని చాలా మంది అనుకున్నారు. కానీ నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టు ఒక్క సినిమా చేస్తే , ఇప్పటికీ ఆయన సినిమాలకు వసూళ్ల సునామీ వస్తుందని నిరూపించిన చిత్రం ‘ఓజీ’. కేవలం రెండంటే రెండు సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఆయన సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు.

నేటి తరం యూత్ ఆడియన్స్ మొత్తాన్ని ఓజీ మేనియా లో మునిగి తేలేలా చేశాడు . ఈ స్థాయిలో జెన్ జీ యూత్ ని అలరించిన చరిత్ర ఈమధ్య కాలం లో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా జరగలేదు. ఓపెనింగ్స్ కూడా ఈ చిత్రానికి కనీవినీ ఎరుగని రేంజ్ లో వచ్చాయి. రెండు మూడు భాషలకు సంబంధించిన వసూళ్లు కలుపుకుంటే కానీ , వంద కోట్ల గ్రాస్ రానటువంటి ఈరోజుల్లో, ఈ చిత్రానికి కేవలం తెలుగు వెర్షన్ నుండి మొదటి రోజు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిది అనేది. ముఖ్యంగా ఈ చిత్రానికి నమోదైన ప్రీమియర్ షోస్ గ్రాస్ వసూళ్లను ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ సినిమా కూడా అందుకోలేకపోయింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ ద్వారా 63 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డు ని కనీవినీ ఎరుగని రేంజ్ హైప్ తో విడుదలైన ‘ధురంధర్ 2’ కూడా బ్రేక్ చేయలేకపోయింది. కేవలం 60 కోట్ల గ్రాస్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నేడు విడుదలైన ‘పెద్ది’ చిత్రం కచ్చితంగా ‘ఓజీ’ రికార్డుని బద్దలు కొడుతుందని అంతా అనుకున్నారు, కానీ సగం కూడా రాబట్టలేకపోయింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఇలా భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ రెండు సినిమాలు విఫలం అయ్యాయి , ఇప్పుడు ఈ రికార్డు ని భవిష్యత్తులో ఎవరు బద్దలు కొట్టబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. వచ్చే ఏడాది విడుదల అవ్వబోయే ‘స్పిరిట్’, ‘వారణాసి’ చిత్రాలు ఈ రికార్డు ని కొడుతుందని ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version