Homeఎంటర్టైన్మెంట్Vijay vs Rajinikanth: విజయ్ ని సీఎం అవ్వకుండా రజినీకాంత్ అడ్డు పడుతున్నాడా? తమిళనాడు రాజకీయాల్లో...

Vijay vs Rajinikanth: విజయ్ ని సీఎం అవ్వకుండా రజినీకాంత్ అడ్డు పడుతున్నాడా? తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్..

Vijay vs Rajinikanth: తమిళనాడు రాజకీయాలు ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా తమిళ హీరో విజయ్ టీవీకే పార్టీ ని స్థాపించి , ఏకంగా 107 స్థానాల్లో విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే మ్యాజిక్ ఫిగర్ ని అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం 118 సీట్లు కావాలి. ముందుగా వామపక్షాలు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి , కానీ చివరి నిమిషం లో వెనక్కి తగ్గాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముందుకొచ్చింది. ఎన్నికల్లో వాళ్ళు దాదాపుగా 5 సీట్లలో గెలిచారు. మరో రెండు సీట్లు పీఎంకే పార్టీ నుండి వచ్చాయి. మొత్తం మీద 114 సీట్లు విజయ్ వద్ద ఉన్నాయి, ఇక కేవలం నాలుగు సీట్లు మాత్రమే అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కావాలి. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకి ఏ మాత్రం సహకరించడం లేదు.

తమ ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితిలోనూ విజయ్ కి మద్దతు తెలపరాదని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. నిన్న గవర్నర్ ని కలిసి, 20 మంది మంత్రులతో కూడిన లిస్ట్ ని ఇచ్చి, ప్రభుత్వ ఏర్పాటుకి కోరగా , మెజారిటీ సీట్లు చూపించాల్సిందిగా గవర్నర్ ఆదేశించాడు. అది అసెంబ్లీ ఫ్లోర్ లో నిరూపించుకుంటామని విజయ్ చెప్పినప్పటికీ కూడా గవర్నర్ అంగీకరించలేదు. అంతే కాకుండా నిన్న డీఎంకే + అన్నా డీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని ఒక వార్త వచ్చింది. ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు , కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇరు పార్టీలు తేల్చి చెప్పాయి. ఇలా ప్రతీ క్షణం ట్విస్టుల మీద ట్విస్టులు , మంచి పొలిటికల్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి. మరోపక్క తెరపైకి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా వచ్చాడు.

రీసెంట్ గానే ఆయన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ని కలిసాడు. ఆయన కలిసిన రోజే డీఎంకే , అన్నా డీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయనే వార్త వచ్చింది. రజినీకాంత్ వెళ్లి స్టాలిన్ ని కలవడానికి కారణం ఇదే, విజయ్ ని సీఎం అవ్వనివ్వకుండా రజినీకాంత్ అడ్డుపడుతున్నాడు. డీఎంకే + అన్నా డీఎంకే పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థి గా రజినీకాంత్ నిలుస్తాడని , ఆయన త్రిచి ఈస్ట్ నుండి పోటీ చేస్తాడని , ఇలా ఒక్కటా రెండా , ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు గవర్నర్ ని కూడా రజినీకాంతే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కానివ్వకుండా చూస్తున్నాడని , గవర్నర్ తో రజిని కి మంచి సాన్నిహిత్యం ఉందని అంటున్నారు. ఇన్ని రూమర్స్ రావడానికి గల కారణం , విజయ్ , రజినీకాంత్ మధ్య కోల్డ్ వార్ నడవడం వల్లే అని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version