Venky Movie Re Release: ఈ మధ్య కాలం లో రీ రిలీజ్ సినిమాల హవా టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూత్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్న సినిమాల్నే ఎక్కువగా రీ రిలీజ్ చేస్తున్నారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. గత ఏడాది విడుదలైన ఖుషి, పోకిరి, జల్సా సినిమాలు. అలాగే ఈ ఏడాది విడుదలైన తొలిప్రేమ, మరియు ఈ నగరానికి ఏమైంది చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించాయి.
తొలిప్రేమ అంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా కాబట్టి వసూళ్లు వచ్చాయి అనుకుందాం. కానీ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం లో ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేదు, కేవలం ఆ చిత్రానికి యూత్ లో క్రేజ్ ని క్యాష్ చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా కి దాదాపుగా రీ రిలీజ్ లో నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అందుకే బయ్యర్స్ ఇప్పుడు ఇలా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన సినిమాలను 4K క్వాలిటీ కి మార్చి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించిన ఆల్ టైం క్లాసిక్ చిత్రం ‘వెంకీ’ ని కూడా ఇలాగే రీ మాస్టర్ చేయించి ఈ ఏడాది డిసెంబర్ 30 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నిన్ననే జరిగింది.
యూత్ లో ఈ సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అందుకే ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం ఆల్ టైం రికార్డు గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్ర రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రీ రిలీజ్ చిత్రాలలో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పుతుందా లేదా అనేది.