https://oktelugu.com/

Ravi Teja Daughter: తండ్రి అడుగుజాడల్లో కూతురు..ఆ స్టార్ డైరెక్టర్ కి ‘అసిస్టెంట్ డైరెక్టర్’ గా రవితేజ కూతురు తొలి చిత్రం!

సినిమా ఇండస్ట్రీ మీద పిచ్చి తో, ఎలాంటి సపోర్టు లేకుండా వచ్చిన హీరో మాస్ మహారాజ రవితేజ. ఇతను వెండితెర పై కనిపించే ముందు, తెర వెనుక అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెయ్యాల్సి వచ్చింది. ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్ వద్ద రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 08:14 PM IST

    Ravi Teja Daughter

    Follow us on

    Ravi Teja Daughter: సినీ ఇండస్ట్రీ లో ఎలాంటి అండాదండా లేకుండా పైకి ఎదగడం అనేది మాటల్లో చెప్పినంత తేలిక కాదు. కెరీర్ ప్రారంభం లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ క్రమంలో ఎన్నో అవామనాలు, ఛీత్కారాలు ఎదురు అవుతాయి, వాటిని భరించాలి. సంపాదించే డబ్బులు సరిపోక, పస్తులతో పడుకునే రోజులు వస్తాయి, వాటిని అనుభవించాలి. మొత్తం మీద ఒక నరకం లోకి అడుగుపెట్టి, ఎన్నో పరీక్షలను ఎదురుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ తెలిసే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాలి. అలా సినిమా ఇండస్ట్రీ మీద పిచ్చి తో, ఎలాంటి సపోర్టు లేకుండా వచ్చిన హీరో మాస్ మహారాజ రవితేజ. ఇతను వెండితెర పై కనిపించే ముందు, తెర వెనుక అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెయ్యాల్సి వచ్చింది. ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్ వద్ద రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు.

    ఇతని లోని ఎనర్జీ ని గమనించిన దర్శక నిర్మాతలు ఈయనకి హీరో అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. మొదటి రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో థియేటర్స్ వద్ద ఆడలేదు కానీ, ‘ఇడియట్’ అనే చిత్రం ఆయన కెరీర్ ని ఒక మలుపు తిప్పింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత రవితేజకి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇలా రవితేజ కెరీర్ ని బాగా దగ్గర నుండి పరిశీలించిన ఆయన కూతురు కూడా రవితేజ లాగానే ఎదగాలని అనుకుంటుంది. తన తండ్రి లాగానే ఈమె కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సూర్య దేవర నాగ వంశీ బ్యానర్ అయినటువంటి సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఒక ప్రముఖ దర్శకుడు తెరకెక్కించబోయే సినిమాకి రవితేజ కూతురు మోక్షద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెయ్యబోతుందట. రవితేజ లాంటి స్టార్ కొడుకు, లేదా కూతురు సినిమాల్లోకి వస్తున్నారంటే ఏ హీరోనో, హీరోయినో అవుతారని అభిమానులు ఆశిస్తారు.

    కానీ రవితేజ కూతురు మోక్షద కి నటన మీద కంటే కూడా ఎక్కువగా దర్శకత్వం మీదనే ఆసక్తి ఉందట. అందుకే ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి దర్శకత్వం లో మెలుకువలు నేర్చుకునే పనిలో పడిందట. రవితేజ కొడుకు మహాదన్ గురించి మన అందరికీ తెలిసిందే. ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో రవితేజ చిన్నప్పటి పాత్రలో మహాధన్ ఎంత చక్కగా నటించాడో మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఒక స్టార్ డైరెక్టర్ శిక్షణ లో నటన నేర్చుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండేళ్లలో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. ఈయన కేవలం హీరో గా మాత్రమే కొనసాగుతాడా?, లేకపోతే ఇతనికి కూడా మోక్షద లాగా దర్శకత్వం కూడా ఇష్టం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.