https://oktelugu.com/

Prashanth Neel: ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నారనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : December 12, 2024 / 08:32 PM IST

    NTR And Prashanth Neel

    Follow us on

    Prashanth Neel: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఒక ఎత్తు అయితే ఇక మీదట రాబోయే విజయాలు మరొక ఎత్తు అనేంతలా ముందుకు సాగుతూ ప్రేక్షకులను సైతం అబ్బుర పరిచేలా సినిమాలు చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న ‘డ్రాగన్ ‘ సినిమా మీద తన పూర్తి ఫోకస్ ని కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ లాంటి నరుడికి ఒక భారీ సినిమా పడితే మాత్రం ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొడుతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ లాంటి హీరో పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ను సాధించి ముందుకు దూసుకెళ్లాడు. ఇక ఎన్టీఆర్ మాత్రమే కొంతవరకు వెనుకబడ్డాడు. మరి ఈ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేయడానికి ఆయన ప్రశాంత్ నీల్ తో భారీ బడ్జెట్ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఈ సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొడతానని చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ వరుసగా కేజిఎఫ్, సలార్ లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు కాబట్టి ఆయన డైరెక్షన్ లో సినిమా చేస్తూ ఉండటం ఎన్టీఆర్ కి చాలా వరకు కలిసి వచ్చే అంశమనే చెప్పాలి.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంటర్ వెల్ లో ఒక భారీ ట్విస్ట్ ఇవ్వడంతో పాటు పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ని కూడా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు సలార్ లో ఇంటర్వెల్ సీన్లు ఇచ్చిన హై ఎలివేషన్ ఎలాగైతే ఉంటుందో ఈ సినిమాలో అంతకు మించిన ఎలివేషన్ ఇవ్వడానికి తన ప్రయత్నం చేస్తున్నాడు…

    మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా వర్క్ అవుట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా స్టార్ట్ అయి రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. 2025 మార్చి నుంచి ఈ సినిమాని స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాను చాలా పకడ్బందీ ప్రణాళికతో చేసి సూపర్ సక్సెస్ సాధిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…