Ravi Teja: ఇండస్ట్రీ మొత్తం ప్రస్తుతం వారసులతో నిండిపోయింది. స్టార్ హీరోలు అందరూ బడ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలే కావడం విశేషం… వీళ్లను కాదని ఇప్పటికి కూడా స్టార్ హీరోల్లో ఒక్కడిగా చలామణి అవుతున్న ఏకైక హీరో రవితేజ.. ఇంట్లో వాళ్లు సినిమాలంటే ఇష్టం లేదని చెప్పిన కూడా, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి అవకాశాల కోసం ఎదురుచూసి, మొదట్లో చిన్న చితక పాత్రలు వేసి ఆ తర్వాత స్టార్ హీరోగా మారిన ఒకే ఒక్కడు రవితేజ…
అయితే ఈయన కెరియర్ లో చాలా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. అయినప్పటికీ ముఖ్యంగా ఒక నాలుగు సినిమాల ద్వారానే ఆయన స్టార్ హీరోగా మారాడు అనే విషయం చాలా మందికి తెలియదు…ఆయన కెరియర్ లో ఇప్పటివరకు వరుసగా మంచి విజయాలను అందుకున్నాడు. కానీ పూరి డైరెక్షన్ లో వచ్చిన ‘ ఇడియట్ ‘ సినిమాతో ఆయనకు ఒక టర్నింగ్ పాయింట్ అయితే దొరికింది. అప్పటి నుంచి రవితేజతో సినిమాలు చేయడానికి పెద్ద డైరెక్టర్లు సైతం పోటీ పడ్డారు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కి రవితేజకు దగ్గర చేస్తూ వచ్చిన సినిమా ‘భద్ర’. ఈ సినిమాతో రవితేజ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు ‘ సినిమాతో అటు కామెడీని, ఇటు రౌద్రాన్ని పండిస్తూ అప్పటివరకు రవితేజ కెరియర్ లో సాధించలేని భారీ వసూళ్లను సాధించి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ సినిమాతో రవితేజ టాప్ లెవెల్లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన స్టార్ ఇమేజ్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు.
ముఖ్యంగా రవితేజ కెరీర్ ను నిలబెట్టిన నాలుగు సినిమాలు ఇవే.. ఇవి లేకపోతే ఆయన స్టార్ హీరో ఆయ్యేవాడు కాదేమో అనేంతల ఆయన లైఫ్ ను టర్న్ చేసిన సినిమాలు మాత్రం ఇవే…ఇక ఇప్పుడు వరుసగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ సక్సెస్ లు సాధిస్తున్నాడు..