Tiger Nageswara Rao OTT: భారీ అంచనాల మధ్య విడుదలైంది టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియా చిత్రంగా అక్టోబర్ 20న దసరా కానుకగా ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందన్న క్రిటిక్స్ సెకండ్ హాఫ్ నిడివి పెరిగి సాగదీతకు గురైందని అభిప్రాయపడ్డారు. సాంగ్స్ సినిమాకు మైనస్ అని తెలిపారు. అయినప్పటికీ టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది.
టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి లియో, భగవంత్ కేసరి చిత్రాల నుండి గట్టి పోటీ ఎదురవుతుంది. కాగా టైగర్ నాగేశ్వరరావు డిజిటల్ పార్టనర్ ఎవరో సమాచారం అందుతుంది. ఈ పీరియాడిక్ బయోపిక్ ని అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ ధర చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం. ప్రైమ్ లో టైగర్ నాగేశ్వరరావు స్ట్రీమ్ కానుంది. దీపావళి తర్వాత టైగర్ నాగేశ్వరరావు అందుబాటులోకి వచ్చే అవకాశం కలదు. విడుదలైన ఆరు లేదా ఎనిమిది వారాల్లో స్ట్రీమ్ కానుందని అంటున్నారు.
టైగర్ నాగేశ్వరరావు మూవీలో రవితేజ 70లలో దేశాన్ని ఒణికించిన స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు పాత్ర చేశాడు. చెప్పి దొంగతనాలు చేయడంలో దిట్టైన నాగేశ్వరరావును అందరూ టైగర్ నాగేశ్వరరావు అనేవారు. ఇతడు పేదోళ్ల దృష్టిలో దేవుడు. పెద్దలను దోచి పేదలకు పంచిన ఇండియన్ రాబిన్ గుడ్ గా పేరుగాంచాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన టైగర్ నాగేశ్వరరావు దొంగగా ఎలా మారాడు. అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటో చిత్రంలో చెప్పారు.
టైగర్ నాగేశ్వరరావు మూవీకి వంశీ దర్శకుడు. రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటించింది. ఈ చిత్రంతో రేణూ దేశాయ్ కమ్ బ్యాక్ ఇవ్వడం విశేషం. మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, నాజర్, జిషు సేన్ గుప్తా కీలక రోల్స్ చేశారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. టైగర్ నాగేశ్వరరావు ఫలితం తెలియాలంటే వీకెండ్ వరకు వేచి చూడాల్సిందే..