Ravi Teja Multiplex: ఈమధ్య కాలంలో మన సినిమా హీరోలు ఒకపక్క సినిమాలు చేసుకుంటూనే మరోపక్క వ్యాపారాలు కూడా భారీగా చేసుకుంటున్నారు. మన టాలీవుడ్ హీరోస్ తో చేతులు కలిపి ఏషియన్ సునీల్ నారంగ్(Sunil Narang) హైదరాబాద్ లో ఇప్పటికే పలు మల్టీప్లెక్స్ లను ప్రారంభించారు. ముందుగా మహేష్ బాబు(Super Star Mahesh Babu) తో ఓం రాశాడు. ఆయనతో కలిసి ప్రారంభించిన AMB సినిమాస్ మల్టీప్లెక్స్ కి ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా బాగున్నా, బాగాలేకపోయినా కచ్చితంగా ఈ థియేటర్ లో సినిమా చూడాల్సిందే అని ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయిపోయి ఉంటారు. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న థియేటర్ ఇది. ఆ తర్వాత ఏషియన్ సంస్థ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో కలిసి AVD సినిమాస్, అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తో కలిసి అమీర్ పేట్ లో AAA సినిమాస్ ని ప్రారంభించాడు.
Also Read: సుజీత్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
ఇవన్నీ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) తో కలిసి ‘ART సినిమాస్’ ని ప్రారంభించబోతున్నాడు. ART అనగా (ఏషియన్ రవితేజ సినిమాస్) అన్నమాట. ఈ మల్టీ ప్లెక్స్ నిర్మాణ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. కేవలం ఇంటీరియర్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. జులై 10 లోపు అది కూడా పూర్తి అవుతుందని అంటున్నారు. హైదరాబాద్ లోనే మొట్టమొదటి భారీ EPIQ స్క్రీన్ ఈ మల్టీప్లెక్స్ లోనే ఉంటుందట. ఇది 57 అడుగుల వెడల్పు తో ఉంటుందని సమాచారం. అత్యాధునిక టెక్నాలజీ ని ఉపయోగించి, డాళ్బీ అట్మాస్ తో అద్భుతమైన సౌండింగ్ ఎఫెక్ట్ ఈ మల్టీ ప్లెక్స్ లో ఏర్పాటు చేశారట. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న మల్టీ ప్లెక్స్ థియేటర్స్ అన్నిటికంటే, ఈ మల్టీ ప్లెక్స్ చాలా మోడరన్ గా ఉంటుందని, అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఈ మల్టీప్లెక్స్ కలిగిస్తుందని అంటున్నారు. కచ్చితంగా ఇది AMB ని డామినేట్ చేస్తుందట.
ఈ మల్టీ ప్లెక్స్ ని జులై 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రంతో గ్రాండ్ గా మొదలు పెట్టబోతున్నారని టాక్. ప్రముఖ సినీ సెలబ్రిటీలు ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం లో పాల్గొనబోతున్నారట. ఇప్పటికే పలు మార్లు కొన్ని సినిమాలను రఫ్ గా ప్లే చేసి క్వాలిటీ టెస్టింగ్ చేసారని, అనుభూతి వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. చూడాలి మరి ఆడియన్స్ కి ఈ మల్టీ ప్లెక్స్ ఏ రేంజ్ అనుభూతులు ఇవ్వబోతుంది అనేది. ఇకపోతే రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు నెలలో విడుదల కాబోతుంది. శ్రీలీల ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి,మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.