Udaya Bhanu Bigg Boss 9 Telugu: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) సెప్టెంబర్ నెలలో ప్రసారం కాబోతుంది. అయితే ఈ సీజన్ చాలా కొత్తగా ఉండబోతుంది. వరుసగా 8 సీజన్స్ ని ఆదరిస్తూ వచ్చిన ప్రేక్షకులకు ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టే బంగారం లాంటి అవకాశాన్ని కల్పించింది బిగ్ బాస్ టీం. ఈ షోలోకి వెళ్లేందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా వివరంగా చెప్పుకొచ్చారు. జులై 8 వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎన్నో లక్షల మందిలో కేవలం 4 లేదా 5 మంది సామాన్యులకు ఈ షో లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కలుగుతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో సెలబ్రిటీల ఎంపిక విషయం లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది టీం.
Also Read: సుజీత్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
ఎన్నో ఏళ్ళ నుండి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి ఉన్న సెలబ్రిటీలను మాత్రమే ఇందులోకి తీసుకొస్తున్నారు. వారిలో ఒకరు ప్రముఖ టీవీ యాంకర్ ఉదయ భాను(Udaya Bhanu). మన చిన్న తనం నుండి ఈమె యాంకరింగ్ చూస్తూ పెరిగాము. పలు సినిమాల్లో ఈమె హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్టు గా కూడా నటించింది. కానీ ఈమధ్య కాలం లో మాత్రం ఈమె ఎక్కువగా అటు బుల్లితెరపై కానీ, ఇటు వెండితెర పై కానీ కనిపించడం లేదు. కారణం ఏమిటో తెలియదు కానీ,ఎందుకో ఆమెకు ఈమధ్య ఆడియన్స్ తో కనెక్షన్ పూర్తిగా పోయింది. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా ఈమె ఆడియన్స్ కి అందుబాటులో లేదు. ఇప్పుడు మళ్ళీ కెరీర్ ని పునః ప్రారంభించుకోవాలని అనుకుంటుంది. అందుకే ‘బిగ్ బాస్’ లో కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు ఆమె అంగీకారం తెలిపిందని సమాచారం. గత సీజన్స్ కి కూడా బిగ్ బాస్ టీం ఉదయ భాను ని సంప్రదించారు.
కానీ ఆమె ఎందుకో ఒప్పుకోలేదు. కానీ ఈ సీజన్ కి మాత్రం ఆమె అడిగిన వెంటనే ఒప్పుకుంది. రెమ్యూనరేషన్ కూడా వారానికి మూడు లక్షల రేంజ్ లో ఇచ్చేందుకు అంగీకారం తెలిపారట. బిగ్ బాస్ హిస్టరీ లోనే ఇది ఆల్ టైం రికార్డు అని అంటున్నారు. అయితే ఉదయ భాను కి ఇప్పుడు ఆడియన్స్ లో క్రేజ్ లేదు కాబట్టి, ఆమె మొదటి వారమే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆమె కచ్చితంగా తన మార్కుని మొదటి రోజు నుండి క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే మనుగడ సాగించడం కష్టం అని అంటున్నారు నెటిజెన్స్. చూడాలి మరి ఈమె ఏమేరకు నెట్టుకొని రాగలదు అనేది. ఈమె తో పాటు ప్రముఖ ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ సెలబ్రిటీ ఉప్పల్ బాలు కూడా ఈ షోకి ఎంపిక అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.