Kubera Flopped In Tamil: రీసెంట్ గా విడుదలైన శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ‘కుబేర'(Kuberaa Movie) చిత్రానికి చాలా విచిత్రమైన ఫలితం వచ్చింది. తెలుగు వెర్షన్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఉన్నాయి. నిన్న కూడా బుక్ మై షో యాప్ లో 70 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. తెలుగు వెర్షన్ లో ఇంత పెద్ద హిట్ అయిన ఈ చిత్రం తమిళం లో మాత్రం ధనుష్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిల్చింది. గతంలో కూడా ద్విభాషా చిత్రాలు ఒక భాషలో హిట్ అయ్యి, మరో భాషలో యావరేజ్ రేంజ్ లో ఆడేవి. కానీ ఒక భాషలో హిట్ అయ్యి,మరో భాషలో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగలడం ఈ సినిమాకి మాత్రమే జరిగింది. 18 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని ఈ చిత్రం తమిళనాడు లో చేసింది.
Also Read: సుజీత్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
అంటే ఈ చిత్రానికి కచ్చితంగా 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు దాటాలి. అప్పుడే సూపర్ హిట్ అన్నట్టు. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 18 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. కనీసం రెండవ వీకెండ్ అయినా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తాయని ట్రేడ్ ఆశించింది. కానీ అది జరగలేదు. సినిమాకు ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ధనుష్ ఈ చిత్రం తో కచ్చితంగా నేషనల్ అవార్డుని మరోసారి అందుకుంటాడని సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. కానీ ఎందుకు తమిళ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించలేదు అంటే అందుకు ముఖ్య కారణం ఇది తెలుగు డైరెక్టర్ సినిమా అవ్వడం వల్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ధనుష్ గత తెలుగు చిత్రం ‘సార్’ కి కూడా తమిళం లో ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదు అని ఉదాహరణగా చెప్తున్నారు.
రెండవ కారణం కచ్చితంగా హీరో ధనుష్(Dhanush) అని అంటున్నారు. ఎందుకంటే తమిళనాడు లో ధనుష్ కి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. అక్కడి స్టార్ హీరోల లీగ్ లో ధనుష్ కూడా ఉన్నాడు. ఎన్నో కమర్షియల్ మాస్ సినిమాలు చేసాడు. ఒక మాస్ హీరో ఇమేజ్ సొంతం అయిన హీరో,ఇలా ఎలాంటి హీరోయిజం, ఎలివేషన్స్ లేని క్యారక్టర్ చేయడాన్ని అక్కడి ఆడియన్స్ తీసుకోలేకపోయారు. తెలుగు లో ఇంతటి ఆదరణ వచ్చిందంటే అందుకు కారణం ధనుష్ మన ఆడియన్స్ కి కొత్త కాబట్టి. ఆయన ఏమి చేసినా ఒక నటుడిగానే చూస్తారు కాబట్టి ఇక్కడ ఏ సమస్య లేదు. కానీ తమిళం లో మాత్రం ధనుష్ ని ఆడియన్స్ ఒక స్టార్ గానే చూస్తారు. ఒక స్టార్ హీరో ఇలాంటి రోల్స్ చేయడం ఇండియా లోనే ఈమధ్య కాలంలో ఎక్కడ జరగలేదు. అందుకే అక్కడ అలాంటి ఫలితం వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.