Ravi Teja and Mahesh Babu : ప్రస్తుతం రవితేజ మంచి సినిమాలను చేయాలన్న అవసరం అయితే ఉంది…ఇప్పటికైనా ఆయన తన రూటు మార్చి కొత్త తరహా సినిమాలను చేస్తే బాగుంటుందని తన అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం కమర్షియల్ సినిమాలను నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మంచి సక్సెస్ సాధిస్తున్నప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఒకప్పుడు రవితేజ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాడు కానీ ఒకానొక సందర్భంలో రవితేజ రిజెక్ట్ చేసిన ఒక మూడు సినిమాలు మహేష్ బాబు కెరియర్ లో భారీ బ్లాక్ బస్టర్స్ గా మిగిలాయి. అందులో మొదటిది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబ (Mahesh Babu) హీరోగా వచ్చిన పోకిరి (Pokiri) సినిమా స్టోరీని పూరి జగన్నాధ్ మొదట రవితేజకి వినిపించారట. ఆ కథ తనకు సెట్ అవ్వదని రవితేజ ఆ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత పూరి ఈ సినిమాను మహేష్ బాబుతో చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్న విషయం మనకు తెలిసిందే… శీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘దూకుడు’ (Dukudu) సినిమా కథని మొదటి శ్రీను వైట్ల రవితేజ కి వినిపించాడట.
ఎందుకంటే రవితేజ శ్రీనువైట్ల కి మధ్య మంచి బాండింగ్ ఉంది. అలాగే ఆ సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ చాలా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రవితేజ అయితే ఆ ఎనర్జీ సినిమాకి చాలా బాగా సరిపోతుంది అనే ఉద్దేశంతో రవితేజ కి కథ చెప్పగా ఆయన అప్పుడు వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఆ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read : పవన్ కళ్యాణ్ సినిమాలో మహేష్ బాబు.. పాత్ర మిస్ కావడానికి కారణం ఏంటి?
ఇక ఆ తర్వాత శీను వైట్ల మహేష్ బాబు కి ఈ కథ చెప్పి అతనితో సినిమా చేసి సక్సెస్ సాధించి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు… ‘శ్రీమంతుడు’ సినిమా స్టోరీని కూడా కొరటాల శివ మొదటి రవితేజ కే వినిపించారట. కొరటాల శివ భద్ర సినిమాకి డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్నప్పుడు సర్ మంతుడు కథ లైనప్ రవితేజకు వినిపించారట.
రవితేజ మాత్రం ఆ కథని పూర్తి చేసుకొని తర్వాత తనకు కనిపించమని చెప్పారట. అయినప్పటికి ఆ తర్వాత రోజుల్లో వచ్చిన చేంజెస్ వల్ల ఆ కథ కి రవితేజ కంటే మహేష్ బాబు బాగా సెట్ అవుతారని రవితేజను పక్కనపెట్టి మహేష్ బాబు తో సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు…