Homeఎంటర్టైన్మెంట్Bollywood Star Shilpa Shetty: శిల్పాశెట్టికి ఊరట.. 15 ఏళ్ల నాటి ముద్దు కేసులో ముద్దుగుమ్మ...

Bollywood Star Shilpa Shetty: శిల్పాశెట్టికి ఊరట.. 15 ఏళ్ల నాటి ముద్దు కేసులో ముద్దుగుమ్మ తప్పేమి లేదన్న న్యాయస్థానం..

Bollywood Star Shilpa Shetty: బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శిల్పాశెట్టి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో, మీడియాలో చర్చనీయాంశంగా ఉంది. ఆమె భర్త ఓ కేసులో జైలుకు వెళ్లగా, తర్వాత ఆమె తల్లిపై కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమె ఉక్కిరి బిక్కిరి అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెపై ఉన్న పాత కేసు ఒకటి విచారణకు వచ్చింది. అందులో శిల్పాశెట్టికి ఊరట లభించింది. ఆమెపైన నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. ఇందులో ఆమె నిందితురాలు కాదని, బాధితురాలని తేల్చింది.
దాంతో శిల్పాశెట్టి సంతోషపడింది. ఇంతకీ ఆ కేసు ఏమిటంటే..

Bollywood Star Shilpa Shetty
Bollywood Star Shilpa Shetty

2007, ఏప్రిల్ 15న రాజస్థాన్ రాష్ట్రంలో ఎయిడ్స్‌పైన అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి, హాలీవుడ్ హీరో రిచర్డ్ గెరె వచ్చారు. ఈ కార్యక్రమ వేదికపైన అందరూ చూస్తుండగానే శిల్పాశెట్టిని రిచర్డ్ గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అది చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. టీవీల్లో , పత్రికల్లో దీని గురించి తర్వాత పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Bollywood Star Shilpa Shetty
Bollywood Star Shilpa Shetty

Also Read: Bollywood: బాలీవుడ్ స్టార్ హీరో కి, ఆయన భార్య కి కరోన పాజిటివ్… ఎవరంటే ?

ఈ క్రమంలోనే కొందరు బహిరంగంగా ఇలా ముద్దు పెట్టుకోవడం ఏంటని నిరసన తెలిపారు. రిచర్డ్ ముద్దు పెట్టుకోవడానికి వచ్చినపుడు శిల్ప ఎందుకు ప్రతిఘటించలేదని పలువురు ప్రశ్నించారు. ఈ విషయమై అప్పట్లో కాన్పూర్, వారణాసి, దేశ రాజధాని ఢిల్లీ, ముంబై నగరాల్లో నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలపై కేసు నమోదు చేసి అరెస్టు వారెంట్ కూడా జారీ చేశారు పోలీసులు.

పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేయగా, సెలబ్రిటీలిద్దరూ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. భారత అత్యున్నత న్యాయస్థానం వారిరువురిపై జారీ అయిన వారెంట్లను రద్దు చేసింది. కాగా, అప్పటి నుంచి కేసు విచారణ కొనసా..గుతూనే ఉంది. రాజస్థాన్ నుంచి కేసు ముంబై కోర్టుకు బదిలీ కాగా, తాజాగా విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా కోర్టు శిల్పాశెట్టి తప్పు ఏం లేదని తేల్చింది. రిచర్డ్ గెరెను నిందితుడిగా పేర్కొంది. అయితే, అలా చేసినందుకుగాను రిచర్డ్ అప్పట్లోనే క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే శిల్పాశెట్టిపైన ఉన్న ఫిర్యాదులన్నీ నిరాధారమని కోర్టు తేల్చేసింది.

Also Read: సోనూసూద్ సైతం రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] Ravi Teja: రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్‌ లను వరుసగా విడుదల చేస్తున్నారు. రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది టీమ్. ఇక ఈ యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ లో రవితేజ దూకుడుగా కనిపిస్తున్నాడు. పోస్టర్ లో రవితేజ వివిధ భావోద్వేగాలలో కనబడుతున్నాడు. మొత్తానికి రవితేజ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు ‘రామారావు’. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular