Ravi Teja: మాస్ మహారాజా రవితేజ(Mass Maharaja Raviteja) ఎక్కడి నుండి ఇండస్ట్రీ లోకి వచ్చాడో, ఏ స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగాడో మన అందరికీ తెలిసిందే, ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, తద్వారా వచ్చిన ఫేమ్ తో హీరో గా మారి, ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకుంటూ ఈ రేంజ్ కి వచ్చాడు రవితేజ. అయితే అప్పట్లో రాఘవేంద్ర రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే రవితేజ, మొట్టమొదటిసారి వెండితెర పై కనిపించిన చిత్రం అల్లరి ప్రియుడు. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరో గా నటించిన ఈ సినిమాలో రవితేజ రాజశేఖర్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడిగా ఈ చిత్రంలో కనిపిస్తాడు. కనీసం ఆయనకు డైలాగ్స్ కూడా పెద్దగా ఉండవు.
Also Read: ఓదెల 2′ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం ప్రొమోషన్స్ ఖర్చులు కూడా రాలేదు!
అయితే ఈ సినిమాలో రవితేజ ఇచ్చిన సంగీతం కారణంగా ప్రభుదేవా మాస్టర్ రాజశేఖర్ కి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?, ఈ విషయాన్ని స్వయంగా రాఘవేంద్ర రావు అప్పట్లో ‘ధమాకా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో రవితేజ ఒక సాంగ్ షూటింగ్ సమయంలో వెనుక కూర్చొని సాంగ్ తో సంబంధం లేకుండా డ్రమ్స్ వాయిస్తూ ఉన్నాడు. ఆరోజు మేము రాజశేఖర్ కోసం ప్రత్యేకంగా ఒక స్టెప్పు ని కంపోజ్ చేయించాము. ఆ స్టెప్ అలా కంపోజ్ చేయించడానికి కారణం రవితేజ వాయించిన డ్రమ్స్ బీట్ కారణంగానే. ప్రభుదేవా మాస్టర్ ఆరోజు ఆ బీట్ ని ఆధారంగా తీసుకొని రాజశేఖర్ కి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశాడు. ఆరోజు రవితేజ ఉత్సాహంగా డ్రమ్స్ వాయించినప్పుడే అనుకున్నాను, కచ్చితంగా ఇతను భవిష్యత్తులో ఇండస్ట్రీ మోతమోగిపోయే రేంజ్ లో హిట్స్ కొట్టి పెద్ద స్థాయికి వెళ్లాడని’ అంటూ రాఘవేంద్ర రావు మాట్లాడిన మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.
ఆ వీడియో ని మీరు ఇప్పుడు కూడా ఈ ఆర్టికల్ చివర్లో చూడొచ్చు. ఇకపోతే రవితేజ కి ‘ధమాకా’ చిత్రం తర్వాత సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. చివరికి తనకు కెరీర్ లో మిరపకాయ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన హరీష్ శంకర్ కూడా ‘మిస్టర్ బచ్చన్’ తో భారీ ఫ్లాప్ ని చేతిలో పెట్టాడు. ఇప్పుడు రవితేజ కి అర్జెంటు గా సూపర్ హిట్ కావాలి. కొత్త డైరెక్టర్ తో ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘మాస్ జాతర'(Mass Jathara Movie) అనే సినిమా చేశాడు. ఇందులో హీరోయిన్ గా శ్రీలీల(Heroine Sreeleela) నటించింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా, జూన్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.