Ravi Teja: కొత్తగా వచ్చే డైరెక్టర్లు తమ టాలెంట్ ను నిరూపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి సినిమా అవకాశం వస్తే చాలా సంతోషించి ఎట్టి పరిస్థితుల్లో అయినా హిట్ కొట్టాలని చూస్తారు. కానీ కొన్ని సార్లు హీరోల అనవసర సలహాల వల్ల సినిమా ఫ్లాప్ అవుతుంది. స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ లేకుండా కొందరు హీరోలు ఇన్వాల్వ్ అవడం వల్ల మంచి కథలు కాస్త చెడిపోతుంటాయి. దాని వల్ల యంగ్ డైరెక్టర్లు సినిమాను తెరకెక్కించే టప్పుడు ఒక విధంగా అనుకుంటే ఆ తర్వాత మరోలా వస్తుంటుంది.
దాని వల్ల కొంత మంది డైరెక్టర్లు వాళ్లకు ఉన్న టాలెంట్ చూపించుకోలేకపోతుంటారు. అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో కొంత మంది ఉన్నారు. ఎవరో చేసిన తప్పుకు కొన్ని సార్లు వీరు బలి అవుతుంటారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వాళ్ళ టాలెంట్ ను పూర్తి స్థాయిలో ప్రూవ్ చేసుకోవడానికి కొంత మంది డైరెక్టర్లు ముందుకు వస్తున్నారు. ఇక రీసెంట్ గా ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మరో డైరెక్టర్ ఎంట్రీ ఇస్తున్నారు. సుబ్రహ్మణ్యపురం, లక్ష్య సినిమాలతో డీసెంట్ హిట్లు కొట్టిన సంతోష్ జాగర్లపూడి ఒక మాసివ్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం ఈ డైరెక్టర్ సుమంత్ హీరోగా మహేంద్రగిరి వారాహి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఒక డిపరెంట్ అటెంప్ట్ కానుందట. దేశవ్యాప్తంగా కాంతార సినిమా ఎలాగైతే తన ఐడెంటిటినీ సంపాదించుకుందో.. ఈ సినిమా కూడా దేవుడి కథతో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమా కూడా ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా నిలవబోతుందని సమాచారం. ఇందులో భాగంగానే ఈ దర్శకుడికి పలు ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి అడ్వాన్సులు కూడా అందినట్టు టాక్. ముఖ్యంగా తెలుగులో భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ యంగ్ డైరెక్టర్ మీద ముందుగానే కర్చీఫ్ వేసినట్టు టాక్.
అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజ తో ఈయన సినిమా చేయబోతున్నట్టు టాక్. ప్రతి ఒక్కరికి టైమ్ వస్తుందనేది ఎంత నిజమో.. ఇప్పుడు ఈ డైరెక్టర్ కు టైం వచ్చిందనేది కూడా అంతే నిజం అంటున్నారు కొందరు. ఇక రవితేజతో ఈ యంగ్ డైరెక్టర్ సినిమా ఉండబోతుంది అన్నమాట. అయితే ఇప్పటికే డైరెక్టర్ సంతోష్ రవితేజకు సినిమా లైన్ వినిపించారట. ఈ లైన్ రవితేజకు బాగా నచ్చి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారని తెలుస్తోంది. మరి చూడాలి ఈసినిమా ఎప్పుడు స్టాట్ అవుతుందో..