Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ తన వరుస పరాజయాల పరంపరను ‘క్రాక్’ సినిమాతో ఎట్టకేలకు అడ్డుకుని మొత్తానికి భారీ హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం ‘ఖిలాడి’ అనే సినిమాని దర్శకుడు రమేష్ వర్మతో చేస్తున్నాడు. కాగా రవితేజ ఖిలాడి మూవీ బాలీవుడ్‌లో రిలీజ్ అయ్యే అవకాశముంది. గతంలో రవితేజ నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్‌లో రిలీజై, హిట్‌గా నిలిచాయి. దీంతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఖిలాడి’ని కూడా హిందీ వెర్షన్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఇటీవల పుష్ప మూవీ హిందీలో హిట్ కావడంతో.. ‘ఖిలాడి’ నిర్మాతలు కూడా బాలీవుడ్ రిలీజ్ కు ఆసక్తి చూపుతున్నారట .అయితే, ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడట. పైగా అదీ తండ్రీకొడుకులుగా. అన్నట్టు సినిమా కథ ఎక్కువుగా ముసలి రవితేజ పాత్ర చుట్టే తిరుగుతుందని.. ముసలాడు అయినప్పటికీ ఒక పాతికేళ్ల అమ్మాయితో ప్రేమలో పడతాడని, అక్కడి నుండి కథ ఎన్ని మలుపులు తిరిగింది ? చివరకు ముసలాడి కథకు ఎలాంటి ముగింపు దక్కింది అనేది మెయిన్ ప్లాట్ అట.
Also Read: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 14 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

ఇక ఈ సినిమాలో రవితేజది డబుల్ రోల్ కాబట్టి ఇద్దరు హీరోయిన్లని తీసుకున్నారు. ఆ ఇద్దరి హీరోయిన్స్ లో ఒకరు మీనాక్షి చౌదరి అనే కొత్త భామ, అలాగే మరో హీరోయిన్ గా ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఒక పాటలో డాన్స్ చేసిన డింపుల్ హయతిను హీరోయిన్ గా తీసుకున్నారు.
Also Read: ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా?