Ravi Teja: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం చేస్తున్న వరుస చిత్రాలలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా రవితేజ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో కొత్త పేరు పెట్టుకున్నారు. ‘రవితేజ ఆన్ డ్యూటీ’ అంటూ రవితేజ మార్చుకున్న పేరుకు సంబంధించిన ఆయన ట్విట్టర్ అకౌంట్ స్క్రీన్ షాట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మూవీ టీం మొత్తం ఇలాగే పేర్లు మార్చుకోవడం విశేషం. అన్నట్టు రామారావు ఆన్ డ్యూటీ సినిమా టీజర్ కూడా రిలీజ్ కి సిద్ధమైపోతోంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని మార్చ్ 1న ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నారు. రియల్ సంఘటనల ఆధారంగా శరత్ మండవ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తీస్తున్నాడు.
Also Read: ‘కళావతి’తో యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న మహేష్ !
ఇటీవల పోలీస్ చిత్రాలు హిట్ కొడుతుండగా, రామారావు ఆన్ డ్యూటీ కూడా విక్రమార్కుడు తరహాలో హిట్టవుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ పోవడంతో కొత్త దర్శకులు అందరూ ఇప్పుడు రవితేజ చుట్టూ తిరుగుతున్నారు. కథ నచ్చితే.. వెంటనే ఛాన్స్ ఇవ్వడానికి రవితేజ ముందుకు ఉత్సాహంగా ఉంటాడు.
అందుకే, రవితేజ కోసం చాలామంది దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘ధమాకా’. ‘డబుల్ ఇంపాక్ట్’ అనేది క్యాప్షన్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ నిన్న హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రస్తుతం రవితేజతో ఫైట్ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్ యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఇందుకు భారీ బడ్జెట్తో ప్రత్యేక సెట్ వేశారు.
Also Read: ప్రభాస్ సినిమాకి వినూత్న విచిత్ర ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా ?
[…] […]