Ravi Teja Flop Movie in OTT: మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ ‘ఖిలాడీ’. రవితేజ కథానాయకుడిగా రమేశ్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్. డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా మార్చి 11న స్ట్రీమింగ్ కానుంది.
కాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ డిస్నీ+హాట్‌స్టార్ ట్రైలర్‌ను విడుదల చేసింది. అయితే, మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించినా.. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి ఇద్దరూ ఎక్స్ పోజింగ్ విషయంలో పోటీ పడినా ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. రమేష్ వర్మ దర్శకత్వం కూడా ఈ సినిమాకి బాగా మైనస్ అయింది.
Also Read: సెకండ్ ఇన్నింగ్స్ ఘనంగా మొదలుపెట్టిన ‘హాసిని’ !
ఇక ఈ సినిమా కోసం చేసిన భారీ ప్రమోషన్స్ లో.. సగం స్క్రిప్ట్ పై పెట్టినా సినిమా బెటర్ గా ఉండేది. మొత్తానికి రవితేజ ఇచ్చిన అవకాశాన్ని రమేష్ వర్మ వాడుకోలేకపోయాడు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా దారుణంగా పరాజయం పాలు అయింది. మొత్తమ్మీద ‘ఖిలాడీ’ సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. నిజానికి ఈ సినిమాకి రూ.22.3 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్ ఉంది.
అయితే, అది ఎంతవరకు నిజం అనేది ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి లెక్కల ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. కానీ, ఈ సినిమా అందులో సగం కూడా రాబట్టలేకపోయింది. మొత్తానికి రవితేజ ‘ఖిలాడీ’ పరిస్థితి బాక్సాఫీస్ దారుణమే అనుకోవాలి.
Also Read: రెమ్యునరేషన్ పెంచేసిన సమంత !