https://oktelugu.com/

Genelia : సెకండ్ ఇన్నింగ్స్ ఘనంగా మొదలుపెట్టిన ‘హాసిని’ !

Genelia : ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటూ మధ్యలో హ‌..హ‌..హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది. అమాయకమైన అందంతో పాటు చిలిపిగా నవ్వించే అల్లరి ఆమె సొంతం. అభినయంలోనూ తిరుగులేని క్రెడిట్ ను దక్కించుకున్న తెగింపు ఆమె వరం. ఆమె బొమ్మరిల్లు యువరాణి జెనీలియా. సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జెనీలియా పెళ్లి తర్వాత అభిమానుల ముందుకు రాలేదు. తాజాగా సౌత్‌లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు […]

Written By:
  • Shiva
  • , Updated On : March 6, 2022 / 01:09 PM IST
    Follow us on

    Genelia : ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటూ మధ్యలో హ‌..హ‌..హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది. అమాయకమైన అందంతో పాటు చిలిపిగా నవ్వించే అల్లరి ఆమె సొంతం. అభినయంలోనూ తిరుగులేని క్రెడిట్ ను దక్కించుకున్న తెగింపు ఆమె వరం. ఆమె బొమ్మరిల్లు యువరాణి జెనీలియా. సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జెనీలియా పెళ్లి తర్వాత అభిమానుల ముందుకు రాలేదు.

    Genelia

    తాజాగా సౌత్‌లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి మొదటి సినిమాలో ముఖ్యపాత్రలో జెనీలియా నటించనుంది. పాన్ ఇండియా స్థాయిలో ఇది తెరకెక్కనుంది. సత్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జెనీలియా.. సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్ మూవీలతో మంచి పేరు తెచ్చుకుంది. అసలు ఆమె సినిమాలతో హిట్‌ లతో సంబంధం లేకుండా తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది.

    జెనీలియా అందరి హీరోయిన్స్ లా కాదు. ఆమె నవ్వులాగే ఆమె కూడా చాలా స్వచ్ఛమైనది. రెమ్యునరేషన్ కోసం సినిమాలు చేయలేదు, పేరు కోసం ఎన్నడూ పరిధి దాటలేదు. అదృష్టం కలిసి వచ్చినా ఆమె మాత్రం ఎప్పుడూ నెల పైనే ఉంది. అయితే, కెరీర్‌ పీక్‌ స్టేజ్‌ లో ఉండగానే బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ ముఖ్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం అయింది.

    Also Read: రెమ్యునరేషన్ పెంచేసిన సమంత !

    కానీ సౌత్ ప్రేక్షకులు ఆమెకు దూరంగా కాలేదు. ఇప్పటికీ ఆ హాసిని ప్రతి ఇంట్లో ఉంది. ప్రతి వారం వచ్చే సినిమాల్లో ఉంది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న జెనీలియా, త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉంది. ఈ క్రమంలోనే ఆమె వరుస సినిమాలు చేస్తోంది. జెనీలియా చేయబోయే సినిమాల లిస్ట్ మాత్రం బాగా ఆసక్తిని పెంచుతుంది.

    హీరో రామ్‌ కొత్త సినిమాలో… అలాగే ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో, చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్‌ లో కూడా జెనీలియా నటించబోతుంది. మరి జెనీలియా సెకెండ్ ఇన్నింగ్స్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

    Also Read: నాగార్జున మాస్ సినిమా గురించి మీకు ఈ విషయాలు తెలుసా..

    Tags