Yajuvendra chahal dhanashree : యజువేంద్ర చాహల్ (yazuvendra chahal) ధనశ్రీ (dhanashree) ని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నాడు. కొద్ది సంవత్సరాల పాటు వీరిద్దరి వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగింది. ధనశ్రీ కొరియోగ్రాఫర్. బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం కూడా వహించింది.. చాహల్, ధనశ్రీ గత ఏడాది ఓ రియాల్టీ డ్యాన్స్ షో లో కూడా పాల్గొన్నారు. ఆ సమయం ధనశ్రీ చాహల్ ను ఎత్తుకుని సంచలనం సృష్టించింది.
ఎవరికి వారే
ఇలా అన్యోన్యంగా సాగుతున్న ధనశ్రీ – చాహల్ వైవాహిక జీవితంలో ఒక్కసారిగా సంచలనం చోటు చేసుకుంది. యజువేంద్ర చాహల్ (yazuvendra chahal), ధనశ్రీ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జాతీయ మీడియాలో వీరిద్దరూ విడిపోతున్నట్టు కథనాలు ప్రసారమయ్యాయి. చివరికి వారిద్దరు ఎవరి దారులు వారు చూసుకున్నారని.. ఇక విడాకులే తరువాయి అని తేలిపోయింది. అనుకున్నట్టుగానే వారిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది.. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ” 45 నిమిషాల పాటు యజువేంద్ర చాహల్ (yazuvendra chahal), ధనశ్రీకి కౌన్సిలింగ్ ఇచ్చాం. అయినప్పటికీ వారు మనసు మార్చుకోలేదు. పరస్పర అంగీకారంతో ఎవరిదారులు వారు చూసుకుంటున్నామని చెప్పారని” బాంద్రా కోర్టు వర్గాలు వెల్లడించాయి.. విడిపోయిన అనంతరం ధనశ్రీ ఇన్ స్టా లో ఓ స్టోరీని పోస్ట్ చేసింది.. “ఒత్తిడి నుంచి బయటపడ్డాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. భారాన్ని వదులుకున్నాను.. బరువును తొలగించుకున్నాను.. ఇప్పుడు స్వేచ్ఛగా అనిపిస్తోంది. కొన్ని ప్రతి బంధకాల నుంచి దూరం జరిగినప్పుడే మనం అంటే ఏమిటో తెలుస్తుందని” అర్థం వచ్చేలాగా ధనశ్రీ స్టోరీ పోస్ట్ చేసింది. విడాకుల అనంతరం యజువేంద్ర చాహల్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే వెళ్లిపోయాడని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. “బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు ధనశ్రీ, చాహల్ వేరువేరు వాహనాల్లోనే వచ్చారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ సెంటర్లోకి వెళ్లిపోయారు. ముగ్గురు లాయర్లు ఆ సెంటర్లోకి వచ్చారు. సుమారు 45 నిమిషాలు వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నాన్ని లాయర్లు చేశారు. ఇదంతా కూడా న్యాయమూర్తి సమక్షంలో జరిగింది. అయితే కలిసి ఉండడానికి వారిద్దరు ఒప్పుకోలేదు. పైగా ఎవరి దారులు వారు చూసుకున్నామని.. ఇప్పుడు కలిసి ఉండడంలో అర్థం లేదని ఇద్దరు వ్యాఖ్యానించారు. కనీసం పక్క పక్క సీట్లలో కూర్చోవడానికి కూడా వారు ఇష్టపడలేదని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.