Ravi Teja: ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’తో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ మంచి ఊపుమీదున్నాడు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీని పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచారు మాస్ మహారాజ్. అయితే ఇప్పుడు తాజాగా రవితేజ 70వ చిత్రాన్ని డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నట్లు సినిమా వర్గాలలో చర్చించుకుంటున్నారు.
రవితేజ – సుధీర్ వర్మ కాంబోలో ఎప్పటి నుంచో ఒక చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం సుధీర్ వర్మ సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో ఓ కొరియన్ మూవీ ఆధారంగా ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడట. ఈ ఆదివారం ఈ ప్రాజెక్టు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు. మాస్ రాజా 70వ చిత్రానికి సుధీరే దర్శకుడని, ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనుండగా… రవితేజ సొంత నిర్మాణ సంస్థ ఆర్.టి.టీమ్ వర్క్స్ కూడా ఈ చిత్రంలో భాగస్వామి కానుందని తెలుస్తుంది. మరి వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఏదో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాలి.
ఇదిలా ఉంటే రవితేజ ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. “రామారావు ఆన్ డ్యూటీ ” సినిమాని శరత్ మండవ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం రెండవ షెడ్యూల్ పూర్తి దశకు చేరుకుంది. అలానే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో “ధమాకా” అనే సినిమా చేస్తున్నట్లు దసరా పండుగ సందర్భంగా పోస్ట్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.