Actor Sampath: తెలుగు తమిళ కన్నడ వంటి చిత్రాలలో విలన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు నటుడు సంపత్. ఎటువంటి పాత్రలో అయినా తన నటనతో ఆ పాత్రకు జీవం పోసి ఎలా నటిస్తారు సంపత్ మిర్చి, రన్ రాజా రన్, అజ్ఞాతవాసి వంటి చిత్రాలలో పలు పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకున్నారు సంపత్.

ప్రముఖ సినీ విలన్ సంపత్‌ను తాపేశ్వరంలోని మడతకాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్ బాహుబలి కాజాతో సత్కరించింది. కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ హీరో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “బంగార్రాజు” షూటింగ్ సీతానగరం మండలం వంగలపూడిలో జరుగుతోంది. షూటింగ్‌లో పాల్గొన్న సంపత్‌ను సురుచి పీఆర్‌ఓ వర్మ కలిసి బాహుబలి కాజాతో సత్కరించారు.
సోగ్గాడే చిన్ని నాయానా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగార్జున. ఇప్పుడు మరోసారి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఆ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘బంగార్రాజు’తో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేయడానికి వస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నారు. చైతూకు జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా, నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ కనిపించనుంది. నాగార్జున, చైతూ లు ఒకే సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ మూవీ కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ గా నిలవాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.