Homeజాతీయ వార్తలుResearch and Analysis By Public Pulse: సర్వే: హుజూరాబాద్ లో బీజేపీదే జయం?

Research and Analysis By Public Pulse: సర్వే: హుజూరాబాద్ లో బీజేపీదే జయం?

Research and Analysis By Public Pulse: హుజూరాబాద్ లో అధికార టీఆర్ఎస్ మట్టి కరవడం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ ను ఎదురించి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ను హుజూరాబాదీలు గెలిపించబోతున్నారని మరో సర్వే తేల్చింది. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు బయటపడుతున్నాయి. ఈ సర్వేల్లో టీఆర్ఎస్ ను అధిగమించి బీజేపీ విజయం సాధించడం ఖాయమని తేలుతోంది.

Etela Rajendar
bjp etela rajendar

తాజాగా ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ బై పబ్లిక్ పల్స్’ సర్వే సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో అనూహ్య ఫలితం తేలింది. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయం అని తేలింది. హుజూరాబాద్ లో బీజేపీకి 50.9 శాతం ఓట్లు, టీఆర్ఎస్ కు 44.3శాతం ఓట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ కు 2.7శాతం, ఇతరులకు 2.1 శాతం మాత్రమే వస్తాయని తేలింది.

-ఎగ్జిట్ పోల్స్ లో తేలింది ఇదే..

MANDAL NAME                     LEADING PARTY
HUZURABAD                         BJP
JAMMIKUNTA                      BJP
ELLANTHAKUNTA              BJP
VEENAVANKA                     TRS
KAMALAPUR                        BJP

HUZURABAD MUNCIPALITY 50-50 (OR) TRS

JAMMIKUNTA MUNCIPALITY- BJP

– ఈటెల రాజేందర్ మొదటి నుంచి నియోజకవర్గ ప్రజలతో సత్సబంధాలు కొనసాగించడం ఆయనకు ప్లస్ అయ్యింది.

➢ ఈ నియోజకవర్గంలో రాజేందర్ చేసిన అభివృద్ధితో పాటు ప్రజలకు రాజేందర్ చేసిన వ్యక్తిగత సహాయ సహకారాల వలన హుజురాబాద్ ప్రజలుబీజపీ వైపుమొగ్గు చూపుతున్నా రు

➢ టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ పూర్తిస్థాయిలో నియోజకవర్గ ప్రజలకు తెలియకపోవటం రాజేందర్ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి కావడం వల్ల బీజేపీ వైపు మొగ్గు చూపారని సర్వేలో తేలింది. ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అన్న భావనలోనే ప్రజలు ఉన్నారని.. మిగతా పార్టీల నేతలు, ఓటర్లు కూడా ఈటెలకు ఓటు వేశారని తేలింది.

➢ ఎమ్మెల్యేగా ఉన్నపుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎపుు డు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాడనే పేరు ఈటలకు ఉంది.

➢ ఈ నియోజక వర్గ ప్రజలు ఎక్కువ శాతం మంది పార్టీలతో సంబంధం ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటు వేస్తాం అనే అభిప్రాయాన్ని వ్యక్తి చేశారు. అదే ఈటల రాజేందర్ ను గెలిపించింది.

హుజూరాబాద్ ఎగ్జిట్ పోల్స్ సర్వే రిపోర్టును కింద చూడొచ్చు

HUZURABAD EXIT POLL REPORT – 2021

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version