Homeఎంటర్టైన్మెంట్Actress Genelia: సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయిన నటి జెనీలియా...

Actress Genelia: సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయిన నటి జెనీలియా…

Actress Genelia: ‘సత్యం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార జెనిలియా. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక సిద్ధార్థ్‌ హీరోగా వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హాసిని పాత్రతో ఒక్కసారిగా కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకుందీ చిన్నది. ‘బొమ్మరిల్లు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో హాసినిగా నిలిచిపోయింది జెనీలియా. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశముఖ్ ను వివాహం చేసుకొని నటనకి దూరమైంది. ఇక పిలల్లు పుట్టాకా ఇంటిపట్టునే ఉంటూ వారి ఆలనా పాలన చూసుకోవడం మొదలుపెట్టింది. ఇక దీంతో పాటు భర్త బిజినెస్ లను చూసుకుంటూ బిజీగా ఉన్న జెనీలియా మరోసారి సినిమాలపై దృష్టి పెట్టనుంది.

Actress Genelia
actress genelia started her second innings in films with a marathi movie

Also Read: దిగ్గజ నటులతో పోలిస్తే.. కమలహాసన్ కు ఆ విషయంలో నిరాశే..!

ఈ నేపథ్యంలోనే అమ్మడు రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసింది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలిపింది. ” మీ అందరి ప్రేమాభిమానాలతో అన్ని భాషల్లోనూ చేశాను.. కానీ, నేను ఇంతవరకు పుట్టిపెరిగిన మహారాష్ట్ర చిత్ర పరిశ్రమ మరాఠీ లో మాత్రం పూర్తి స్థాయి పాత్రను చేయలేక పోయాను. ఇప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొంటున్నాను. ఇప్పుడు నా కల నెరవేరబోతోంది. ‘వేద్’ సినిమాలో నేను ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. జియో శంకర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రితేష్ దర్శకత్వం వహించడం గమనార్హం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి జెనీలియా రీ ఎంట్రీ తెలుగులో ఎప్పుడు ఉంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: “డిటెక్టివ్ సత్యభామ” గా రానున్న సోనియా అగర్వాల్…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version