ఆ నేతలు టీఆర్ఎస్ లో చేరిన ఫలితం లేకపాయే?

తెలంగాణ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిలిచింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండే ఈ జిల్లా క్రమంగా గులాబీమయంగా మారింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏ పని మొదలుపెట్టాలన్న ఈ జిల్లా నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా మారింది. దీంతో ఈ జిల్లాలో టీఆర్ఎస్ బలంగా మారింది. ఇక టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ చెందిన ముఖ్యనేతలంతా కారు పార్టీలోకి జంపయ్యారు. Also Read: ఆస్పత్రుల కరోనా దోపిడీ.. చోద్యం […]

Written By: Neelambaram, Updated On : August 5, 2020 8:44 pm
Follow us on


తెలంగాణ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిలిచింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండే ఈ జిల్లా క్రమంగా గులాబీమయంగా మారింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏ పని మొదలుపెట్టాలన్న ఈ జిల్లా నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా మారింది. దీంతో ఈ జిల్లాలో టీఆర్ఎస్ బలంగా మారింది. ఇక టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ చెందిన ముఖ్యనేతలంతా కారు పార్టీలోకి జంపయ్యారు.

Also Read: ఆస్పత్రుల కరోనా దోపిడీ.. చోద్యం చూస్తున్న కేసీఆర్?

ఉమ్మడి జిల్లా పరిధిలోని మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో తమకు మున్ముందు అన్ని మంచిరోజులేనని భావించారు. అయితే వీరిని టీఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని టాక్ విన్పిస్తోంది. ఈ ముగ్గురిని పార్టీ పదవుల్లోగానీ.. నామినేటేడ్ పదవుల విషయంలోగానీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని సమాచారం. దీంతో ఈ నేతలు పార్టీలు మారిన ఫలితం దక్కకుండా పోతుందని సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

దీనికితోడు నియోజవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని టాక్ విన్పిస్తోంది. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు తమ ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. పార్టీ కార్యక్రమాలను కూడా పిలువడం లేదని వాపోతున్నారు. మానకొండూరులో తొలి నుంచి రసమయి బాలకిషన్ కు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కు పడటం లేదు. వీరిద్దరు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా ఆరెపల్లికి టీఆర్ఎస్ నేతలు తగిన గుర్తింపు ఇవ్వడం లేదట. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదట. గతంలో ప్రభుత్వ విప్ గా పనిచేసిన తనకు టీఆర్ఎస్ లో అడుగడుగునా అవమానాలు ఎదురవుతుండటంతో పునారోచనలో పడ్డారనే టాక్ విన్పిస్తోంది.

Also Read: మీడియా టైకూన్ పతనం ప్రారంభమైందా?

ఇక హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి పొసగటం లేదనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నియోజకవర్గం అంతటా కలియ తిరిగిన ప్రవీణ్ టీఆర్ఎస్ లో చేరాక పూర్తిగా సైలంటయ్యారు. టీఆర్ఎస్ నేతలు తనకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో కాలం కలిసొచ్చే వారకు స్తబ్ధుగా ఉండాలని తన అనుచరులను ప్రవీణ్ రెడ్డి సముదాయిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా జిల్లాలో పెద్దగా కన్పించడం లేదు. టీఆర్ఎస్ లో చేరినా సరైన ప్రాధాన్యం లేకపోవడంతో ఆయన కూడా సైలంటయ్యారు.

కాలం కలిసొచ్చి పదవులు దక్కుతాయనుకున్న ఈ ముగ్గురు నేతల పరిస్థితి తలకిందులు కావడంతో తిరిగి సొంతగూటికి వెళ్లే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వెళ్లినా మునుపటి గుర్తింపు ఉంటుందా అనే అనుమానంతో తిరిగి కారులోనే కంటిన్యూ అవుతున్నారట. టీఆర్ఎస్ లోనే ఏదో ఒక నామినేటేడ్ పదవీ దక్కించుకోవాలని భావిస్తున్నారట. ఇది కుదరకపోతే రానున్న రోజుల్లో పార్టీ వీడే అవకాశాలున్నాయనే టాక్ విన్పిస్తుంది. అయితే వీరి విషయంలో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!