https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ఆ పని చేసి తన గొయ్యి తానే తవ్వుకున్న రతిక… ఈసారి కష్టమే!

నిన్నటి ఎపిసోడ్ లో నెంబర్ గేమ్ పెట్టారు బిగ్ బాస్. అయితే ప్రశాంత్ కి నువ్వు ఏ స్థానం ఇస్తావని హౌస్ మేట్స్ అడగ్గా .. ఏడో స్థానం ఇస్తాను అని చెప్పింది. అంత తక్కువ స్థానం ఎందుకు ఇచ్చావ్ అని ప్రశాంత్ అడిగాడు. '

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2023 / 04:30 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ రతిక రోజ్ రీ ఎంట్రీ తర్వాత చాలా సైలెంట్ గా ఉంది. మొదటి మూడు వారాలు ఆమె ప్రవర్తన చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ప్రశాంత్ విషయం లో కూడా మంచిగా ఉంది. శివాజీని కాకాపట్టి వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అయిపోయింది. దీంతో ఆమెకు కాస్త పాజిటివిటీ పెరిగింది. ఇంతవరకు బాగానే ఉన్న రతిక .. పదకొండవ వారం లో రెచ్చిపోయింది. నిన్నటి ర్యాంకింగ్ టాస్క్ లో మరోసారి రైతు బిడ్డ పై విరుచుకు పడింది రతిక.

    నిన్నటి ఎపిసోడ్ లో నెంబర్ గేమ్ పెట్టారు బిగ్ బాస్. అయితే ప్రశాంత్ కి నువ్వు ఏ స్థానం ఇస్తావని హౌస్ మేట్స్ అడగ్గా .. ఏడో స్థానం ఇస్తాను అని చెప్పింది. అంత తక్కువ స్థానం ఎందుకు ఇచ్చావ్ అని ప్రశాంత్ అడిగాడు. ‘ నువ్వు అసలు ఏం చేశావ్ .. మొదటి ఐదు వారాలు నువ్వు ఏం ఆట అడావు.. ముందు ఐదు వారాలు నా వెనకాల తిరిగావు .. రైతు బిడ్డ గా వచ్చి కనీసం నాగార్జున సార్ ఇచ్చిన మొక్కను కాపాడుకోలేక పోయావంటూ మండిపడింది.

    రతిక బయట చూసిన విషయాలు గురించి ప్రస్తావించింది. ఇంట్లో జరిగిన ఒక సిట్యువేషన్ వల్ల నీకు పాజిటివ్ గా మారింది… అది నాకు నెగిటివ్ అయింది. నా రీ ఎంట్రీ తర్వాత నువ్వు ఇండివిడ్యువల్ గా గేమ్ ఆడటం లేదు. గ్రూప్ గా ఆడుతున్నావో కూడా తెలియడం లేదు.. నీకు బిగ్ బాస్ చెప్పే రూల్స్ కూడా అర్థం కావట్లేదు అంటూ ఫైర్ అయింది. అంతటితో ఆగకుండా శివన్న చెప్పింది చేస్తున్నావ్ .. అలాగే గేమ్ ఆడుతున్నావ్ అంటూ రతిక నిందలు వేసింది.

    ఒక కామనర్ గా హౌస్ లో అడుగుపెట్టిన నీకు .. కామన్ మ్యాన్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. కానీ నువ్వు అసలు గేమ్ ఆడలేదు అంటూ మాట్లాడుతూ మల్లి గొయ్యి తవ్వుకుంటుంది. ప్రస్తుతం రతిక, పల్లవి ప్రశాంత్ పై చేస్తున్న కామెంట్లు వైరల్ గా మారాయి. రతిక మాటలకి ప్రశాంత్ మరో సారి కన్నీరు పెట్టుకోవడంతో.. నెటిజన్స్ ప్రశాంత్ కి మద్దతు తెలుపుతున్నారు. రతిక ఇంక మారదు.. ఆమెను ఎలిమినేట్ చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది రతిక కి పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. తెలిసి కూడా అదే తప్పు చేసింది. ఇలానే చేస్తే రెండోసారి కూడా ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటున్నారు.