‘తెలుగు బిగ్ బాస్ సీజన్ 5’ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ..? అయిదవ వారంలో ఈ ఎంట్రీ ఉంటుందని ఓ రూమర్ ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో యాంకర్ విష్ణు ప్రియా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తోందట. ఆ రూమర్ సారాంశం ఇదే. ఇప్పటికే విష్ణు ప్రియా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది అంటూ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
నిజానికి బిగ్ బాస్ సీజన్ 5కి ఆశించిన స్థాయి రేటింగ్ రావడం లేదు. ఇప్పటివరకూ వచ్చిన హైయెస్ట్ రేటింగ్ 16.7. ఇక సగటుగా వస్తున్న రేటింగ్ 9.5, ఈ రేటింగ్ బిగ్ బాస్ రేంజ్ కి చాలా తక్కువ. ఎందుకు బిగ్ బాస్ ఈ సారి ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు ? అని ఓ సర్వే చేస్తే.. దానిలో తేలింది, బిగ్ బాస్ ను యూత్ పెద్దగా చూడటం లేదట.
సో.. ఇప్పుడు బిగ్ బాస్ ప్రధాన టార్గెట్ యూత్ నే. ఇప్పటికే హౌస్ లో అందగత్తెలు ఉన్నారు. కానీ బోల్డ్ బ్యూటీలే కనిపించడం లేదు. ఆ లోటును తీర్చడానికే విష్ణు ప్రియా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె ఎంట్రీతో హౌస్ లో హాట్ నెస్ కి ఇక అడ్డు అదుపు ఉండదు అట. నిజానికి గతంలోనే విష్ణు ప్రియా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతుంది అంటూ చాలా పుకార్లు వచ్చాయి.
కానీ ఆమెకు ఆ అవకాశం రాలేదు. పైగా ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాకు బిగ్ బాస్ కాన్సెప్ట్ పెద్దగా నచ్చదు. నేను అక్కడకు వెళ్లాలి అనుకోవడం లేదు. చాలా సార్లు నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా కూడా నేను వద్దు అనుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఈ సారి బిగ్ బాస్ ఆమెకు భారీ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేశాడట.
అందుకే, ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సిద్ధం అవుతుందట. మరి విష్ణు ప్రియ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. మరోపక్క విష్ణు ప్రియ హాట్ ఫోటో షూట్స్ కూడా ఈ మధ్య తరుచుగా చేస్తోంది. ఈ ఫోటో షూట్ ల వెనుక కూడా బిగ్ బాస్ ఉన్నాడనే ప్రచారం కూడా బాగా వినిపిస్తోంది.
