Homeఎంటర్టైన్మెంట్Rashmika Success Secret Revealed: రష్మిక మూఢ నమ్మకమే స్టార్ ని చేసిందా? 90 శాతం...

Rashmika Success Secret Revealed: రష్మిక మూఢ నమ్మకమే స్టార్ ని చేసిందా? 90 శాతం సక్సెస్ రేట్ తో దూసుకెళుతున్న నేషనల్ క్రష్

Rashmika Success Secret Revealed: రష్మిక మందాన కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. అత్యంత సక్సెస్ రేట్ తో తోటి హీరోయిన్స్ కి సవాలు విసురుతుంది. అయితే రష్మిక స్టార్ కావడానికి కారణం ఏమిటనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఆసక్తికర సంగతులు తెరపైకి వస్తున్నాయి..

కన్నడ పరిశ్రమకు చెందిన రష్మిక మందాన కిరిక్ పార్టీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ఈ చిత్ర దర్శకుడు కాగా, రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్. కిరిక్ పార్టీ షూటింగ్ సమయంలో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. పెళ్ళికి సిద్ధమైన ఈ జంట ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. పెళ్ళైతే కెరీర్ కి ఎండ్ కార్డు పడుతుందని భావించిన రష్మిక, రిషబ్ శెట్టికి షాక్ ఇచ్చింది. వివాహం రద్దు చేసుకుంది. ఈ క్రమంలో విమర్శలపాలైంది. కన్నడ పరిశ్రమను వీడి తెలుగులో అడుగుపెట్టింది. అదే ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది.

ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మంచి విజయం అందుకుంది. గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న రష్మిక భారీ ఫేమ్ రాబట్టింది. సరిలేరు నీకెవ్వరు, పుష్ప విజయాలతో రష్మిక స్టార్ హీరోయిన్ హోదాకు చేరుకుంది. అత్యంత సక్సెస్ రేట్ కలిగిన హీరోయిన్ గా రష్మిక రికార్డులకు ఎక్కింది. దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా మారింది. గత రెండేళ్లలో రష్మిక ట్రాక్ రికార్డు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆమె నటించిన యానిమల్, చావా, పుష్ప 2 వందల కోట్లు కొల్లగొట్టాయి. ఈ మూడు చిత్రాల వసూళ్లు రూ. 3000 కోట్లకు పైగా ఉన్నాయి.

Also Read:  Nagarjuna Comments On Rashmika: రష్మిక నేషనల్ క్రష్ మాత్రమే కాదు..నాకు కూడా క్రష్ నే – అక్కినేని నాగార్జున

తాజాగా కుబేర తో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఇలా వరుస విజయాలు అందుకోవడం మరో హీరోయిన్ కి సాధ్యం కాదేమో. నాగార్జున, చిరంజీవి వంటి బడా స్టార్స్ సైతం రష్మిక మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. రష్మిక సక్సెస్ కి కారణం ఏమిటనే చర్చ మొదలైన నేపథ్యంలో.. ఓ విషయం తెరపైకి వచ్చింది. వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరున్న వేణు స్వామికి రష్మిక శిష్యురాలు. కెరీర్ బిగినింగ్ లో రష్మిక ఆయన్ని కలిసి ప్రత్యేక పూజలు చేయించింది. పలుమార్లు వేణు స్వామితో రష్మిక పూజలు చేయించింది. ఇందుకు ఆధారాలు ఉన్నాయి.

వేణు స్వామి చేసిన పూజలే రష్మిక వరుస విజయాలకు కారణం అంటున్నారు నెటిజెన్స్. అయితే అవన్నీ మూఢ నమ్మకాలు మాత్రమే, స్క్రిప్ట్ సెలక్షన్ తో పాటు రష్మిక హార్డ్ వర్క్, టాలెంట్ ఆమె ఎదుగుదలకు కారణం అని మరికొందరు అంటున్నారు. నిధి అగర్వాల్, డింపుల్ హయాతితో పాటు మరికొందరు హీరోయిన్స్ సైతం వేణు స్వామితో ప్రత్యేక పూజలు జరిపించారు. వారు కెరీర్లో ఎదగలేదన్న విషయం గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక గర్ల్ ఫ్రెండ్ టైటిల్ తో తెలుగు చిత్రం చేస్తుంది. అలాగే హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తుంది.

RELATED ARTICLES

Most Popular