https://oktelugu.com/

Rashmika: ప్యారిస్​లో రష్మిక హాలిడే ట్రిప్​.. అక్కడ ఏం చేస్తోందో తెలుసా?

Rashmika: తన అందం, అభియనయంతో పాటు క్యూట్​ ఎక్స్​ప్రెషన్స్​తో కుర్రకారు మనసును దోచుకుంది హీరోయిన్​ రష్మిక. ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్​ కీలకపాత్ర పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​ భారీ అంచనాలు రేకెత్తించింది. ఇటీవలే ఈ సినిమాా షూటింగ్ పూర్తిచేసుకున్న రష్మిక.. వరుసగా హాలిడే ట్రిప్​లు వేస్తూ ఎంజాయ్​ చేస్తోంది. ఇటీవలే యూఎస్​లో అడుగుపెట్టిన ఈ భామ.. తాజాగా, ప్యారిస్​లో ఎంజాయ్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 01:59 PM IST
    Follow us on

    Rashmika: తన అందం, అభియనయంతో పాటు క్యూట్​ ఎక్స్​ప్రెషన్స్​తో కుర్రకారు మనసును దోచుకుంది హీరోయిన్​ రష్మిక. ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్​ కీలకపాత్ర పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​ భారీ అంచనాలు రేకెత్తించింది. ఇటీవలే ఈ సినిమాా షూటింగ్ పూర్తిచేసుకున్న రష్మిక.. వరుసగా హాలిడే ట్రిప్​లు వేస్తూ ఎంజాయ్​ చేస్తోంది. ఇటీవలే యూఎస్​లో అడుగుపెట్టిన ఈ భామ.. తాజాగా, ప్యారిస్​లో ఎంజాయ్​ చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్​మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అక్కడే తనేం చేస్తోందో రివీల్​ చేసింది రష్మిక .

    Rashmika

    ఈ క్రమంలోనే తన ఫొటోలు షేర్​ చేస్తూ.. ప్రియమైన డైరీ.. ప్యారిస్​లో నా మొదటి రోజు ఇలా ఉంది.. నేను నా ప్యారిస్​ ట్రిప్​ను ఫొటో డంప్ చేయాలని ఆలోచిస్తున్నా.. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పడం కంటే. .చూపిస్తాను.. అంటూ రాసుకొచ్చింది. కాగా, యూఎస్​లో విహారయాత్ర వెళ్లినప్పుడు విజయ్ కోసమని అందరూ అనుకున్నారు. ఆ సమయానికి అక్కడే లైగర్ షూటింగ్​ జరుగుతుండటం విశేషం. ఈ సినిమాకు పూరి జగన్నాథ్​ దర్శకత్వం వహస్తున్నారు. ఇందులో మైక్​టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండను కలిసేందుకు రష్మిక అమెరికా వెళ్లినట్లు గుసగుసలు వినిపించాయి.

    Also Read: ఎక్స్ పోజింగ్ లో విశ్వరూపం చూపిస్తోన్న సమంత !

    ప్రస్తుతం రష్మిక పుష్పలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా తొలి పార్ట్​ను డిసెంబరు 17న విడుదల చేయనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుంది. ఇందులో బన్నీ విభిన్న పాత్రలో కనిపంచనున్నారు. ఇక రష్మిక విషయానికొస్తే.. మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్​లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2022 మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక తన రెండవ బాలీవుడ్ ప్రాజెక్ట్ “గుడ్‌బై”లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ తో కలిసి కనిపించనుంది.

    Also Read: హాట్​ లుక్స్​తో మతిపోగొడుతున్న అర్జున్ రెడ్డి హీరోయిన్​.. ఆ ఛాన్స్ కోసమేనా?

    Tags