https://oktelugu.com/

Stardom: స్టార్డమ్ ఉన్నా.. యాడ్స్ లో నటించని ‘స్టార్స్’ వీళ్లే..!

Stardom: సినిమా నటీనటులకు ప్రజల్లో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు ఏదైనా సినిమాలో చేస్తే అచ్చం అదే ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్లు కోట్లల్లో ఉంటారు. దీంతో వీరితో యాడ్స్ చేసి తమ కంపెనీ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్పొరేట్ కంపెనీలు వారి వెంటపడటం కామన్ అయిపోయింది. ఇక సినిమా స్టార్స్ ప్రకటనలో నటించడం కొత్తేమీకాదు.. ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం కొందరు యంగ్ హీరోలు ఒకటి రెండు హిట్స్ కొట్టగానే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 9, 2021 / 01:30 PM IST
    Follow us on

    Stardom: సినిమా నటీనటులకు ప్రజల్లో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు ఏదైనా సినిమాలో చేస్తే అచ్చం అదే ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్లు కోట్లల్లో ఉంటారు. దీంతో వీరితో యాడ్స్ చేసి తమ కంపెనీ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్పొరేట్ కంపెనీలు వారి వెంటపడటం కామన్ అయిపోయింది. ఇక సినిమా స్టార్స్ ప్రకటనలో నటించడం కొత్తేమీకాదు.. ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది.

    Stardom

    ప్రస్తుతం కొందరు యంగ్ హీరోలు ఒకటి రెండు హిట్స్ కొట్టగానే లెక్కనన్ని బ్రాండ్స్ ప్రమోట్స్ చేస్తూ హల్చల్ చేస్తుంటారు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో పాపులర్ అయిన విజయ్ దేవరకొండనే ఇందుకు నిదర్శనం. పైసలిస్తే ఎలాంటి బ్రాండ్లనైనా ప్రమోట్ చేయడానికి సిద్ధమవుతుంటారు కొందరు స్టార్ హీరోలు. సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే ఏకంగా 15 బ్రాండ్లకు పైగా ప్రమోట్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు.

    మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, డార్లింగ్ ప్రభాస్, దగ్గుపాటి రానా వంటి బడా స్టార్లు కొన్ని కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్స్ కు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే కొందరు స్టార్స్ మాత్రం తమకు ఎంత డబ్బు ఆఫర్ చేసినా కూడా యాడ్స్ లో నటించేది లేదని తెగేసి చెబుతున్నారు.

    వీరిలో నందమూరి నటసింహం బాలకృష్ణ ముందువరుసలో నిలుస్తాడు. టాలీవుడ్లోని అగ్రనటుల్లో బాలకృష్ణ ఒకరు. ఆయన తోటి హీరోలంతా ఏదో ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంటే బాలయ్య మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క యాడ్ లోనూ నటించలేదు. నందమూరి ఫ్యామిలీకే చెందిన కల్యాణ్ రామ్ సైతం యాడ్స్ కు దూరంగానే ఉన్నాడు.

    Also Read: ఆర్మీ సోల్జర్​గా రానా.. ఈ ఏడాది చివరి సినిమాగా విడుదల కానున్న ‘1945’

    కలెక్షన్ మోహన్ బాబు కూడా ఒక్క యాడ్స్ లో నటించలేదు. మంచు విష్ణు, మంచు మనోజ్ కుమార్  సైతం మోహన్ఆ బాబు బాటలోనే నడుస్తున్నారు. ఈవీవీ కుమారుడు అల్లరి నరేష్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సైతం ప్రకటనలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సౌత్ లో నెంబర్ హీరోయిన్ గా ఉన్న అనుష్క శెట్టి సైతం ఇప్పటి వరకు ఏ ఒక్క యాడ్ లోనూ కన్పించలేదు. యంగ్ హీరోయిన్ సాయిపల్లవి, సీనియర్ నటి గౌతమి సైతం యాడ్స్ గా దూరంగానే ఉండటం విశేషం.

    వీరితో కంపెనీలు యాడ్స్ చేసేందుకు సిద్ధంగా  ఉన్నా ఫ్యాన్స్ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం ఇష్టం లేక వీరంతా కార్పొరేట్ యాడ్స్ కు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. కోట్ల రూపాయల పారితోషికం ఇస్తామన్నా ఫ్యాన్స్ కోసం ఆలోచించి యాడ్స్ లో నటించకుండా వీరంతా ఉండటం గొప్పవిషమేనని సినీప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: ఎందుకు అన్నీ బూతులు ? ఫ్యామిలీ నెటిజన్ల కామెంట్లు !