Rashmika Mandanna: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ , తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది రష్మిక మందాన. యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యే పాత్రలు చేస్తూ, అంచలంచలుగా ఎదుగుతూ , పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగి, నేషనల్ క్రష్ అని అనిపించుకుంది. ఈమె డేట్స్ కోసం సౌత్ ఇండియా లో ఎంత డిమాండ్ ఉందో , నార్త్ ఇండియా లో కూడా అంతే డిమాండ్ ఉంది. రీసెంట్ గానే ఈమె బాలీవుడ్ లో హీరోయిన్ గా నటించిన ‘కాక్ టైల్ 2’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఇదంతా పక్కన పెడితే రష్మిక ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో ‘రాకా’ మూవీ కూడా ఉండనే విషయం మన అందరికీ తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో మూవీ లో రష్మిక విలన్ గా నటించబోతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఆమె విలన్ పాత్ర పై సోషల్ మీడియా లో లేటెస్ట్ గా ఒక అసాంకేతికరమైన ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆమె క్రూరమైన రక్త పిశాచి గా కనిపించబోతుంది అట. అమాయకుల రక్తాన్ని పీలుస్తూ , వాళ్ళని అత్యంత క్రూరంగా చంపే పాత్రలో ఈమె కనిపించబోతుందట. అంటే మీకు అర్థం అయ్యే భాషలో చెప్పాలంటే వాంపైర్ పాత్ర అనుకోండి. హీరో , హీరోయిన్లను సైతం వణికించే పాత్రలో ఆమె కనిపించబోతుంది. నటన లో విశ్వరూపం చూపించే ఛాన్స్ రష్మిక కి దక్కింది. ఇక ఇంతటి క్రూరమైన విలన్ క్యారెక్టర్ లో ఆమెని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఇప్పటి వరకు రష్మిక పక్కింటి అమ్మాయి క్యారెక్టర్లు మాత్రమే చేస్తూ వచ్చింది. చాలా క్యూట్ గా అనిపించేవి , అలాంటి పాత్రలు చేసిన అమ్మాయి , ఒక్కసారిగా ఈ రేంజ్ విలన్ రోల్ లో నటిస్తే ఆడియన్స్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమాతో పాటుగా రష్మిక ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం , అదే విధంగా తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి ‘ రణబలి’ అనే చిత్రం లో నటిస్తోంది. పెళ్ళికి ముందు ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న రష్మిక, ఇకపై పెళ్లి తర్వాత ఆమె సినీ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
