The Girl Friend Movie First Review: రష్మిక(Rashmika Mandanna) ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girl Friend Movie) ఈ నెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ప్రముఖ నటుడు/దర్శకుడు రాహుల్ రవిచంద్రన్(Rahul Ravindran) దర్శకత్వం వహించాడు. ఈయన అందాల రాక్షసి చిత్రం లో హీరో గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరో గా నటించాడు, మరికొన్ని సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడు. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం లో కూడా రాహుల్ కీలక పాత్ర పోషించాడు. త్వరలో విడుదల అవ్వబోయే పాన్ ఇండియన్ సినిమాల్లో కూడా రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించాడు. ఇలా ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే, మరోపక్క దర్శకత్వం కూడా వహిస్తూ ఉంటాడు.
ఈయన చివరిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘మన్మథుడు 2’. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ఈ సినిమా భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఈయన దర్శకత్వం లో మరో సినిమా రాలేదు. మళ్లీ ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. లవ్, బ్రేకప్ మరియు ఆ తర్వాత కలిగే ఎమోషన్స్ ని కవర్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. అయితే రీసెంట్ గానే ఈ సినిమాని ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేసారట. కొంతమంది మీడియా ప్రతినిధులు ఈ స్క్రీనింగ్ కి ప్రత్యేక అతిధులుగా విచ్చేసారు. వీళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.
డైరెక్టర్ రాహుల్ ఈ చిత్రాన్ని చాలా కూల్ గా తెరకెక్కించాడని, సినిమాలోని అనేక సన్నివేశాలను చూసినప్పుడు మన లవ్ స్టోరీస్ ని గుర్తు చేసుకునే విధంగా ఉంటుందని, ఓవరాల్ గా ఒక మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఈ సినిమా ఉంటుందని, బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా చాలా తక్కువే కాబట్టి సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా ఉందట. సందర్భానికి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారట. చూడాలి మరి విడుదల తర్వాత కూడా ఆడియన్స్ నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది.
